రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో పుష్ప 2 సినిమా గురించి ఆయన మాట్లాడారు. పుష్ప 2 సినిమా నుంచి టీం గంగమ్మ తల్లి జాతర పోస్టర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం దానికి సంబంధించిన షూట్ ను రామోజీ ఫిలిం సిటీ లో చేస్తున్నామని ఆ సెట్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాను అని చేతులకు ఉన్న పారాణిని అల్లు అర్జున్ చూపించారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుందని అల్లు అర్జున్ అన్నారు.ఇక మంగళవారం సినిమాను నిర్మించిన స్వాతి తనకు మంచి ఫ్రెండ్ అని, ఆ సినిమా గురించి తన వద్ద చర్చించారని తనకు సపోర్ట్ చేస్తానని అల్లు అర్జున్ చెప్పారట. ప్రస్తుతం ఆ ఈవెంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఎంత క్రేజ్ ను సంపాదించుకుందో అందరికీ తెలుసు.
సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇంకా అంతేకాకుండా అల్లు అర్జున్ కి ఇటీవల ఈ సినిమాతో ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు కూడా వచ్చింది.ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అయితే మొదట్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ను చాలామంది కూడా బాగా ట్రోల్ చేశారు.అతని హీరో ఏంటి అని కామెంట్స్ చేశారు. అయితే మంగళవారంసినిమా ఈవెంట్లో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ నా మీద నాకు నమ్మకాన్ని ఇచ్చింది అభిమానులే అని,ఇంకా వాళ్లే నా ఇన్స్పిరేషన్ అని ఆయన అన్నారు. తనమీద తనకి నమ్మకం లేకపోయినా సందర్భంలో అభిమానులు తనకు ఆ నమ్మకాన్ని ఇచ్చారని, ఇలానే మంచి మంచి సినిమాలు చేస్తూ మీరు అనుకున్న స్థాయికి వెళతానని అల్లు అర్జున్ అన్నారు.