మెగా హీరో - నందమూరి కాంబోలో మిస్ ఐనా సినిమా అదేనా....!!
ఇద్దరికీ ఆ సినిమా చెయ్యడం ఇష్టమే, హరికృష్ణ డేట్స్ కూడా ఇచ్చేశాడట. కానీ పవన్ కళ్యాణ్ నుండి డేట్స్ విషయం లో క్లాష్ రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చలేదట. అయితే ఎప్పటికైనా వై వీ ఎస్ చౌదరి ఈ కథని పవన్ కళ్యాణ్ తో చేయించాలని పట్టుదలతో ఉన్నాడట. దురదృష్టం కొద్దీ ఇప్పుడు హరికృష్ణ గారు మన మధ్యలో లేరు.కాబట్టి ఆయన స్థానం లో మెగాస్టార్ చిరంజీవి తో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట వై వీ ఎస్ చౌదరీ. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వై వీ ఎస్ చౌదరి ఈ విషయాన్నీ చెప్పుకొచ్చాడు. చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ని ఆయన ఒప్పించొచ్చు. కానీ వై వీ ఎస్ చౌదరి కి ప్రస్తుతం ఫ్లాపులే ఉన్నాయి.ఆయన్ని నమ్మి కోట్ల రూపాయిలను ఖర్చు చేసే నిర్మాతలు లేరు. ఒకప్పుడు వై వీ ఎస్ చౌదరి నిర్మాతల కోసం ఎదురు చూడకుండా తన సొంత బ్యానర్ 'బొమ్మరిల్లు ఆర్ట్స్' పై సినిమాలను నిర్మించేవాడు. కానీ ఇప్పుడు అంత డబ్బు పెట్టి సినిమా తీసే స్థితిలో చౌదరి కూడా లేదు. రామ్ చరణ్ 'కొణిదెల ప్రొడక్షన్స్' బ్యానర్ అనుకుంటే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకొని వెళ్లొచ్చు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.