ప్రభాస్ ఖాతాలో సూపర్ రికార్డ్ ?

Purushottham Vinay
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ఎన్ని వివాదాల్లో చిక్కుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత ఈ సినిమా వివాదాల ద్వారా చాలా ఎక్కువగా వార్తల్లో నిలిచింది.భారీ నష్టాలతో అట్టర్ ప్లాప్ అయిన ఆది పురుష్  తాజాగా  బుల్లితెరపై ప్రసారం కాగా  బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాకు బుల్లితెరపై రికార్డ్ స్థాయిలో రేటింగ్ రావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.ఇక ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు బుల్లితెరపై ప్రసారమైనా మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడంలో మాత్రం బాగా ఫెయిల్ అవుతున్నాయి.అయితే  ఆదిపురుష్ సినిమా అర్బన్ రేటింగ్ 9.47 కాగా అర్బన్ ప్లస్ రూరల్ రేటింగ్ 8.41 కావడం గమనార్హం. రామాయణం స్టోరీ సినిమాకు ఈ స్థాయిలో రేటింగ్ సాధారణ విషయం కాదని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమాకు మంచి రేటింగ్ రావడం అనేది ఇప్పుడు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.



ప్రభాస్ ఇమేజ్ కు రాముడి సెంటిమెంట్ తోడు కావడం వల్ల ఈ స్థాయిలో రేటింగ్ అనేది సాధ్యమైందని మరి కొందరు చెబుతున్నారు. ప్రభాస్ ఖచ్చితంగా మరిన్ని మైథలాజికల్ సినిమాలలో నటించాలని వివాదాలకు తావివ్వకుండా ఆ సినిమాలు తెరకెక్కేలా ప్రభాస్ జాగ్రత్తలు బాగుంటుందని నెటిజన్లు చెబుతున్నారు. ప్రభాస్ లాస్ట్ ఐదు మూవీల TRP రేటింగ్స్ చూసినట్లయితే..బాహుబలి - 21.5,  బాహుబలి 2 - 22.7, సాహో - 5.8, రాధే శ్యామ్- 8.25,  ఆదిపురుష్ - 9.5 TRP రేటింగ్స్ సాధించాయి. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా డిసెంబర్ 22 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ డిసెంబర్ నెల నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటిదాకా టీజర్ తప్ప ఈ సినిమా నుంచి ఏ కంటెంట్ విడుదల కాలేదు.ఇక సలార్ నార్త్ అమెరికా ప్రీమియర్స్ 21 డిసెంబర్ మధ్యాహ్నం 2:30 కి లేదా 22 డిసెంబర్ అర్ధ రాత్రి 1 కి స్టార్ట్ కానున్నాయి. ఈ సినిమాపై అభిమానులకు లెక్కలేనన్ని ఆశలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: