భక్తకన్నప్ప పై మంచువిష్ణు క్లారిటీ వెనుక ఆంతర్యం !
ఈ సినిమాకు సంబంధించి ఒక మీడియా సంస్థకు ఈమధ్యన ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు ఈసినిమాకు సంబంధించి కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడు సాధారణంగా మన పురాణాల ఆధారంగా తీసే భక్తిరస సినిమాలు మన నేటివిటీలో తీస్తారు. ఇక్కడి లొకేషన్లు ఇక్కడి మనషులు ఈ నేటివిటీలో భక్తిరస సినిమాలు తీసినప్పుడు మాత్రమే ప్రేక్షకులు అలాంటి సినిమాలకు కనెక్ట్ అవుతూ ఉంటారు అన్న అభిప్రాయం పై విష్ణు కామెంట్స్ చేశాడు.
‘కన్నప్ప’ మూవీ షూటింగ్ ఇండియాలో కాకుండా విదేశాలలో ముఖ్యంగా న్యూజీలాండ్ లో ఎందుకు తీస్తున్నారు అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ పై విష్ణు స్పందించాడు. ‘కన్నప్ప’ లాంటి భారీ చిత్రానికి న్యూజీలాండ్ వాతావరణం సరిగ్గా సెట్ అవుతుందని మంచు విష్ణు తాజాగా ఒక పిక్ తో పాటుగా పోస్టు పెట్టాడు. ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’ లాంటి సినిమాలను న్యూజిలాండ్ లో షూట్ చేశారని దానిని స్పూర్తిగా తీసుకుని తాను కూడా ఇలాంటి వాతావరణంలోనే ‘కన్నప్ప’ సినిమా తీయాలని ఫిక్సయిన విషయాన్ని వివరించాడు.
దేవుడి సృష్టిలో న్యూజిలాండ్ ఒక అందమైన పెయింటింగ్ లాంటిదని ‘కన్నప్ప’ చిత్రానికి న్యూజిలాండ్ పర్ఫెక్ట్ లొకేషన్ అని తన అభిప్రాయం అని అంటున్నాడు. ఈమూవీలోని యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు కథలోని ఎమోషన్స్ ను న్యూజీలాండ్ లోని లొకేషన్లు ఎలివేట్ చేస్తాయని ఈ సినిమాను చూసే ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ‘కన్నప్ప’ మూవీని న్యూజీలాండ్ లో తీస్తున్న విషయాన్ని వివరించాడు..