టాలీవుడ్ ఇండస్ట్రిని ఆశ్చర్య పరుస్తున్న కార్తీ వ్యూహాలు !

Seetha Sailaja
తమిళ డబ్బింగ్ సినిమాలను తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగా చూస్తారు కానీ తమ సినిమాల ప్రమోషన్ ను తెలుగు రాష్ట్రాలలో చేయడానికి పెద్దగా ఆశక్తి కనపరచరు. సినిమాకు 100 కోట్ల పారితోషికం తీసుకునే విజయ్ తో దిల్ రాజ్ ‘వారసుడు’ సినిమాను తీసినప్పటికీ ఆసినిమాకు సంబంధించి హైదరాబాద్ లో జరిగిన ప్రమోషన్ ఈవెంట్ కు దిల్ రాజ్ ఎంత ప్రయత్నించినా హీరో విజయ్ రాలేదు అన్నమాటలు వినిపించాయి.

మరో తమిళ హీరో అజిత్ సూర్య కూడ ఇదే పద్ధతి అనుసరిస్తూ ఉంటాడు. అయితే ఈవ్యవహార శైలికి భిన్నంగా తమిళ హీరో కార్తీ అనుసరిస్తున్న వ్యూహాలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. దీపావళిని టార్గెట్ చేస్తూ కార్తీ నటించిన ‘జపాన్’ విడుదలకాబోతున్న విషయం తెలిసిందే. ఈమూవీని ప్రమోట్ చేస్తూ కార్తీ తెలుగు మీడియా సంస్థలకు పత్రికలకు ఎఫ్ ఎమ్ రేడియోలకు వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

ఈ ఇంటర్వ్యూలలో కార్తీ చాలస్పష్టమైన తెలుగులో మాట్లాడుతూ అందరికీ షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కార్తీకి తెలుగు భాష పై ఏర్పడిన పట్టును గమనించిన వారు తెలుగు కార్తీ మాట్లాడుతున్నంత స్పష్టంగా మన యంగ్ హీరోలు కూడ మాట్లాడలేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఊపిరి’ సినిమాలో నాగార్జునతో కలిసి నటించినప్పటి నుండీ కార్తీ కి తెలుగు సినిమాల మార్కెట్ పై బాగా ఆశక్తి పెరిగింది అంటారు.

కొంతకాలం క్రితం విడుదలైన కార్తీ నటించిన ‘ఖైదీ’ తెలుగులో కూడ సూపర్ హిట్ అవ్వడంతో ఈ తమిళ హీరోకు తెలుగు రాష్ట్రాలలో కూడ బాగా అభిమానులు పెరిగిపోయారు. దీనితో అవకాశం వస్తే డైరెక్ట్ గా ఒక మంచి కధతో తలుగు సినిమాను చేయాలని కార్తీ ఆలోచనలో ఉన్నాడు అని కూడ అంతారు. మన టాప్ యంగ్ హీరోలు తాము నటించిన సినిమాలు తమిళంలో విడుదల అవుతున్నప్పుడు తమిళంలో డబ్ చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్నారు. అయితే దీనికి భిన్నంగా కార్తీ తన తెలుగు డబ్బింగ్ సినిమాల విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలు మన టాప్ యంగ్ హీరోలకు కూడ షాక్ ఇస్తున్నాట్లు టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: