రవితేజకు.. మాస్ మహారాజా అనే ట్యాగ్ ఎలా వచ్చిందో తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలను సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకొని నిలబడిన హీరో ఎవరు అంటే చిరంజీవి అని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల మెగాస్టార్ గా కొనసాగుతున్నారు ఆయన. అయితే చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతుంది ఎవరు అంటే అది రవితేజ అని చెప్పాలి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆ తర్వాత హీరోగా అవతారం ఎత్తాడు. ఇక కథల ఎంపికలో జాగ్రత్త పడి సూపర్హిట్లను ఖాతాలో వేసుకున్నాడు.


 ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి మార్కెట్ ఉన్న స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు. రవితేజ అసిస్టెంట్  డైరెక్టర్గా ప్రస్తానాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత నటుడిగా అవతారం ఎత్తాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే రవితేజను తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా మాస్ మహారాజా అనే అభివర్ణిస్తూ ఉంటారు. ఆయనకు ఈ పేరు పెట్టింది.. ఎవరు అన్న విషయం చాలామందికి తెలియదు.




అయితే ఆ వివరాలు చూసుకుంటే.. గతంలో రవితేజ హీరోగా జ్యోతిగా హీరోయిన్గా షాక్ అనే సినిమా వచ్చింది. హరిష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే హరీష్ శంకర్ కు ఇదే మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చింది కూడా రవితేజనే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత హరిశ్ శంకర్ కు పలు సినిమాలు దర్శకత్వం వహించే ఛాన్సులు కూడా వచ్చాయి. అయితే  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హరిశ్ శంకర్ స్టేజి మీదకి ప్రతి ఒక్కరిని పిలవాలి. ఏదైనా స్పెషల్గా ఉండాలి అని ఆలోచించి సుమతో మాట్లాడుకుని ఒక్కొక్కరిని ఒక్కో విధంగా స్టేజి మీదకి పిలిచారట. అదే సమయంలో రవితేజను మాస్ మహారాజా రవితేజ గారు స్టేజి మీదకి రావాలంటూ  పిలిచారట. అప్పుడు ఇక ఆ ఈవెంట్ లో ఉన్న ఫ్యాన్స్ విజిల్స్ తో స్టేడియం దద్దరిల్లిపోయిందట. దీంతో అప్పటినుంచి ఈ పేరు కంటిన్యూ అవుతూ వస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: