శంషాబాద్ లో భూమిపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్..!!
ఇంటర్వ్యూలో మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తారు అనే ప్రశ్న రేణు దేశాయ్ అని అడగగా అందుకు ఆమె ఆసక్తికరమైన సమాధానాన్ని ఇచ్చింది.. రేణు దేశాయ్ మాట్లాడుతూ నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉన్నానని మా నాన్న కూడా ల్యాండ్ డెవలపర్ అని తెలిపింది..హైదరాబాదులో మాకు ఎక్కడ 10 ఎకరాల స్థలము లేదు.. శంషాబాద్ లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజము లేదని తెలిపింది రేణు దేశాయ్ కేవలం అపార్ట్మెంట్ మాత్రమే తీసుకుంటామని .. జయభేరి అపార్ట్మెంట్స్ లో తనకు ఒక అపార్ట్మెంట్ ఉందని తెలిపింది రేణు దేశాయ్.
రేణు దేశాయ్ తన ప్రాపర్టీస్ గురించి ఎవరికీ చెప్పను కన్స్ట్రక్షన్ టైంలో లేదంటే కట్టడం పూర్తి అయిన తర్వాతనే తాను కొత్త ఇల్లుని కొంటానని తెలిపింది..అంతేకాకుండా కాస్త ప్రాపర్టీ వస్తుందంటే ఎక్కువగా అమ్మేస్తానని.. సినిమాలు చేయకపోయినా తనకు ఎలా డబ్బులు వస్తాయని చాలామంది తనని అడుగుతున్నారని.. వారందరికీ నేను ఒకటే చెబుతున్న నేను రియల్ ఎస్టేట్ చేస్తాను దాన్నుంచి సంపాదిస్తున్ననని తెలిపింది రేణు దేశాయ్. ఎంత డబ్బులు వస్తాయని అడగక అందుకు రేణు దేశాయ్ నిరాకరించింది.ఇవన్నీ తనకు పర్సనల్ విషయమని ఇన్కమ్ టాక్స్ కు తనకు తప్ప ఆ వివరాలు ఎవరికీ చెప్తానని తెలిపింది.