'స్వయంభు' కోసం.. నిఖిల్ ఎంత కష్టపడుతున్నాడో చూడండి?
ఈ కొత్త కాన్సెప్ట్ లో ప్రేక్షకులను మెప్పించేందుకు ఇక పాత్ర కోసం తెలియని విద్యలను సైతం నేర్చుకుంటున్న పరిస్థితి నీటి రోజుల్లో కనిపిస్తూ ఉంది ఏకంగా కొంతమంది హీరోలు పాత్ర కోసం కొత్త యాస నేర్చుకుంటుంటే.. ఇంకొంతమంది కర్ర సాము, కత్తి సాము అంటూ వివిధ రకాల విద్యలు నేర్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు నిఖిల్ కూడా ఇలాగే పాత్ర కోసం తెగ కష్టపడి పోతున్నాడు. కార్తికేయ 2 సూపర్ హిట్ తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు నిఖిల్. ఆ తర్వాత 18 పేజీ సినిమాతో మరో హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత మాత్రం స్పై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ చవి చూశాడు అని చెప్పాలి.
ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం స్వయంభు అనే సినిమాలో నటిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. పిరియాడిక్ జోనర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇండియన్ హౌస్ మూవీ ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అయితే నిఖిల్ ఈ మూవీ కోసం బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో ఈ సినిమా తలకెక్కుతూ ఉండగా.. నిఖిల్ సరసన సంయుక్త మేనన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ క్రమంలోనే నిఖిల్ ప్రత్యేకంగా ప్రాచీన యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్ వేదికగా వైరల్ గా మారింది.