ఆ తేదీన "భగవంత్ కేసరి" సక్సెస్ మీట్..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే కొంత కాలం క్రితమే అఖండ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న బాలయ్య ఆ తర్వాత వీర సింహా రెడ్డి మూవీ తో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే తాజాగా భగవంత్ కేసరి మూవీ తో ప్రేక్షకులను పలకరించి ఈ మూవీ తో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.


ఇకపోతే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19 వ తేదీన విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి ఇప్పటికే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ సక్సెస్ మేట్ నిర్వహించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.


అందులో భాగంగా ఈ మూవీ బృందం వారు ఈ నెల 9 వ తేదీన "జే ఆర్ సి" కన్వెన్షన్ ... హైదరాబాద్ లో ఓ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరో ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బాలకృష్ణ మరికొన్ని రోజుల్లో బాబి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: