బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య.. నిజమైతే దబిడి దిబిడే?

praveen
మొన్నటి వరకు సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టేవారు హీరోలు. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి సినిమాలు తప్ప వేరే ప్రపంచం లేదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఈ సీనియర్ హీరోలే ఏకంగా సరికొత్త ట్రెండుకు నాంది పలుకుతున్నారు అని చెప్పాలి. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఇంకోవైపు టాక్ షోలు రియాలిటీ షోలు అంటూ తెగ సందడి చేస్తున్నారు సీనియర్ హీరోలు. అయితే ప్రస్తుతం తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏది అంటే ప్రతి ఒక్కరు బిగ్ బాస్ పేరు చెప్పేస్తుంటారు.



 ఎంత విమర్శలు వచ్చినా.. ఎంత నెగెటివిటీ వచ్చిన ఈ షోకి రేటింగ్ మాత్రం అంతకంతకు పెరిగిపోతుంది. కానీ ఎక్కడ తగ్గడం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. మనందరికీ తెలిసిన సెలబ్రిటీల గురించి తెలియని విషయాలు తెలుసుకునేందుకు బిగ్ బాస్ షో చూస్తున్నారు అని చెప్పాలి. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ షో కి ఎన్టీఆర్, నాని, నాగార్జునలు హోస్టులుగా వ్యవహరించారు అన్న విషయం తెలిసిందే. అయితే నాగార్జున బిగ్ బాస్ హోస్టుగా తప్పుకోబోతున్నారు అంటూ గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి.


 ఈ క్రమంలోనే బిగ్ బాస్ 8వ సీజన్ కోసం స్టార్ మా సంస్థ బాలయ్యను సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే బాలయ్య ఇప్పటికే అటు ఆహా ఓటీపీ వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ తో  తన హోస్టింగ్ సామర్థ్యం ఏంటో నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లోకి కూడా వచ్చాడు అంటే దబిడి దిబిడే అని చెప్పాలి. ఒకవేళ నిజంగానే బాలయ్య బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వచ్చాడు అంటే ఈ షో కి అంతకన్నా మరొక ఎసెట్ ఉండదు. ఎందుకంటే ఏ విషయం మీద అయినా నిర్మొహమాటంగా మాట్లాడే బాలకృష్ణ తీరు కచ్చితంగా ఈ షోని కొత్త స్థాయికి తీసుకువెళ్లడం పక్క అని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: