"ఇండియన్ 2" టీజర్ ను ఏ భాషల్లో ఎవరు విడుదల చేయబోతున్నారు తెలుసా..?

Pulgam Srinivas
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో "ఇండియన్ 2" అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ ... కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే సారి విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన 5 భాషల టీజర్ లను ఐదుగురు సినీ ప్రముఖులు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ భాష టీజర్ ను ఎవరు విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఇండియన్ 2 మూవీ యొక్క తమిళ టీజర్ ను తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ విడుదల చేయబోతున్నాడు.

ఇకపోతే ఈ మూవీ యొక్క తెలుగు టీజర్ ను ప్రపంచ వ్యాప్తంగా దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఎస్ ఎస్ రాజమౌళి విడుదల చేయబోతున్నాడు.

ఈ మూవీ యొక్క కన్నడ టీజర్ ను కన్నడ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి కిచ్చా సుదీప్ విడుదల చేయబోతున్నాడు.

ఈ మూవీ యొక్క మలయాళ టీజర్ ను మలయాళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ విడుదల చేయబోతున్నాడు.

ఈ మూవీ యొక్క హిందీ టీజర్ ను హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అమీర్ ఖాన్ విడుదల చేయబోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: