హీరోల సందడి లేని నవంబర్ !

Seetha Sailaja
నవంబర్ లో దీపావళి ఉన్నప్పటికీ తెలుగు ప్రజలకు ఉన్న అమావాస్య సెంటిమెంట్ వల్ల పెద్ద హీరోలు ఎవరు తమ సినిమాలను దీపావళి పండుగకు విడుదల చేసే ఆలోచన లేకపోవడంతో ఈసారి దీపావళికి సగటు ప్రేక్షకుడుకి హిందీ డబ్బింగ్ సినిమాలు తమిళ డబ్బింగ్ సినిమాలతో సరిపెట్టుకోవలసిన పరిస్థితి. ఈ నెలలో వచ్చే నాలుగు శుక్రు వారాలలోను కేవలం చిన్న సినిమాల హడావిడి మాత్రమే కనిపిస్తున్న నేపధ్యంలో వారానికి కనీసం నాలుగు చిన్న సినిమాలు విడుదల అయ్యే ఈ నెలలో ఎన్ని చిన్న సినిమాలను ప్రేక్షకులు చూస్తారు అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది.

ఈనెల మొదటి శుక్రు వారంలో ‘కోడాకోలా’ ‘నరకాసుర’ ‘పొలిమేర 2’ లాంటి చిన్న సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ ఒక్క ‘కోడాకోలా’ పై మాత్రమే అంచనాలు ఉన్నాయి. ఇక ఈనెల 2వ శుక్రు వారంలో విడుదల అయ్యే ‘అన్వేషి’ ‘వ్యూహం’ ‘అలా నిన్ను చేరి’ చిన్న సినిమాల పై ఏమాత్రం అంచనాలు లేవు. ‘స్పార్క్’ ‘మంగళవారం’ ‘సప్తసాగరాలు’ ‘సైడ్-బి’ లాంటి చిన్న సినిమాలు కూడ వస్తున్నప్పటికీ ఆ చిన్న సినిమాల పేర్లు కూడ చాలమందికి తెలియవు.  

ఈసినిమాలలో పాయల్ రాజ్ పుత్ నటించిన ‘మంగళవారం’ సినిమా దర్శకుడు అజయ్ భూపతిది కావడంతో ఈ మూవీ ఊహించని విజయాన్ని ఏమైనా అందుకుంటుందా అన్న సందేహాలు కొందరికి ఉన్నాయి. ఈనెల చివరి వారంలో ‘ఆదికేశవ’ ‘కోటబొమ్మాళి పిఎస్’ సినిమాలు విడుదల అవుతున్నాయి. ‘ఆదికేశవ’ లో వైష్ణవ్ తేజ్ శ్రీలీల కాంబినేషన్ ఉండటంతో ఆమూవీ హిట్ అయ్యే అవకాశం ఉంది అంటూ కొందరు అంచనాలు వేస్తున్నారు.

వాస్తవానికి ఈనెలలో కళ్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’ విడుదల కావలసి ఉన్నప్పటికీ ఈ మూవీని ఎందుకు ఈనెల నుండి తప్పించారు అన్నవిషయం సస్పెన్స్ గా కొనసాగుతోంది. టాప్ హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడ ఈ నెలలో లేకపోవడంతో చిన్న సినిమాల హవా మాత్రమే కనిపించే ఆస్కారం ఉంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: