డంకీ టీజర్: ఫన్ & ఎమోషనల్ ?

Purushottham Vinay
బాద్షా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి ఓ సర్ ప్రైజ్ ని ప్లాన్ చేసింది 'డంకీ'మూవీ టీం. నవంబర్ 2 షారుక్ ఖాన్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ కోసం 'డంకీ' సినిమా నుంచి టీజర్ను రిలీజ్ చేశారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఈ టీజర్ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది 'పఠాన్', 'జవాన్' వంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్లు పైగా కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న షారుక్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'డంకీ'. ఈ మూవీతో ఎలాగైనా మరో 1000 కోట్ల హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు షారుక్ ఖాన్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది.అందులో మొదటి భాగం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే గురువారం నాడు షారుఖ్ ఖాన్ బర్త్ డే కావడంతో 'డంకి' నుంచి టీజర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. 



ఇక టీజర్ ని గమనిస్తే.. టీజర్ ఆరంభంలో షారుక్ ఖాన్తో పాటు కొంతమంది ఎడారిలో నల్ల డ్రస్ ధరించి ఇల్లీగల్ గా దేశం దాటుతూ మనకు కనిపిస్తారు. ఇక అది చూసిన ఒకడు వారిపై అనుమానం వచ్చి గన్తో వారిలో ఒకరిని కాల్చడం.. ఆ తరువాత ఆ సీన్ డైవర్ట్ చేసి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లారు. ఫ్లాష్ బ్యాక్లో ఫన్ అండ్ ఎమోషనల్గా పాత్రలను పరిచయం చేస్తూ ఈ టీజర్ని ముందుకు తీసుకెళ్లారు.ఇక ఈ టీజర్లో ఐదుగురు యంగ్ స్టార్స్ ఉన్నతమైన జీవితం కోసం ఇంగ్లాండు వెళ్లాలని కలను నెరవేర్చుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ అని టీజర్ చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. పంజాబ్ ప్రాంతంలోని యువకుల కథను బేస్ చేసుకొని ఈ సినిమాను రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండు దేశానికి వెళ్లేందుకు వారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఇల్లీగల్ గా దేశాన్ని దాటేందుకు సిద్ధమైన వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే అంశాలను దేశభక్తిని జోడించి చాలా ఎమోషనల్ గా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో షారుక్ ఖాన్ తో పాటు తాప్సి పన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: