వరల్డ్ కప్ లో మరో సెంచరీ.. డికాక్ అరుదైన రికార్డ్?

praveen
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ భారీ స్కోరులకు వేదికగా మారిపోయింది అని చెప్పాలి. పిచ్ పరిస్థితులు ఎలా ఉన్న పట్టించుకోని బ్యాట్స్మెన్లు ప్రత్యర్థి బౌలర్ల పై చెలరేగిపోతున్నారు. పూర్తి ఆదిపత్యం చెలాయించడమే లక్ష్యంగా సిక్సర్లు పోర్లతో విరుచుకుపడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్లో టీ20 తరహా బ్యాటింగ్ తో సెంచరీల మోత మోగిస్తూ ఉన్న బ్యాట్స్మెన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి అని చెప్పాలి.

 ముఖ్యంగా ప్రపంచ క్రికెట్లో అరవీర భయంకరమైన టీమ్ గా పేరున్న సౌత్ సౌత్ ఆఫ్రికా జట్టు.. ఇక ఇప్పుడు ఆ పేరును సార్ధకం చేసే విధంగానే ప్రదర్శన కొనసాగిస్తుంది. గతంలో పసికూన నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్న ఈ ఛాంపియన్ టీం.. ఇక ఇప్పుడు మాత్రం వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ప్రత్యర్థి ఎంత పటిష్టంగా ఉన్నా సరే లెక్కచేయకుండా.. చిత్తుగా ఓడిస్తుంది అని చెప్పాలి. ఇటీవల న్యూజిలాండ్ ను భారీ తేడాతో ఓడించింది సౌత్ ఆఫ్రికా. ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో వరుసగా సెంచరీల మోత మోగిస్తున్న సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ క్వింటన్ కివిస్ తో జరిగిన మ్యాచ్లో కూడా మరోసారి సూపర్ సెంచరీ తో అదరగొట్టాడు.

 ఈ క్రమంలోనే వరల్డ్ కప్ చరిత్రలోనే సెంచరీలతో క్వింటన్ డికాకు ఒక అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఒక వరల్డ్ కప్ లో నాలుగు సెంచరీలు బాదిన మూడో క్రికెటర్ గా డికాక్ నిలిచాడు. గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్ సంగకర పేరిట ఇలా నాలుగు సెంచరీల రికార్డు ఉండేది. ఇక ఈ రికార్డును సమం చేశాడు ఈ సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్. అయితే ఈ లిస్టులో తొలి స్థానంలో రోహిత్ శర్మ ఒకే వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలు బాది టాప్ లో ఉన్నాడు. డికాక్ దూకుడు చూస్తుంటే తర్వాత మ్యాచ్ లో ఇక రోహిత్ రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: