'సలార్' మూవీపై న్యూస్.. ఫ్యాన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తుందే?

praveen
ప్రస్తుతం ఆల్ ఇండియా సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ మూవీ గురించి అని చెప్పాలి. కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోని పెట్టి చేసిన సినిమా కావడంతో.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు అంచనాలకు మించి ఊహించుకుంటున్నారు. అయితే ఇక ఈ సినిమా ప్రకటన వచ్చి ఏళ్ళు గడిచిపోతున్న.. ఇంకా సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పాలి.


 షూటింగ్ కార్యక్రమాలను మొత్తం కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలి. చిత్ర బృందం కూడా అధికారికంగా డేట్ ప్రకటించడంతో మూవీ చూసేందుకు ప్రేక్షకులు కూడా సిద్ధమయ్యారు.  కానీ చివరి నిమిషంలో ఈ మూవీని వాయిదా వేశారు మేకర్స్. సినిమాలోని కొన్ని సీన్స్ ని రీ షూట్ చేయాలని ప్రకటన చేశారు. దీంతో డిసెంబర్ 22వ తేదీన తప్పకుండా థియేటర్లలో వస్తుందని కొత్త రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. దీంతో ప్రభాస్ డైనోసార్ మూవీ అయిన సలార్ తప్పకుండా అడ్డొచ్చిన వాళ్ళను తొక్కుకుంటూ వెళ్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కూడా గర్వంగా చెప్పుకోవడం మొదలుపెట్టారు.


 కానీ ఇప్పుడు సలార్ మళ్లీ వాయిదా పడబోతుంది అన్న వార్త ఫ్యాన్స్ అందరిలో కూడా గుబులు రేపుతోంది. డిసెంబర్ 22వ తేదీన ఒక్కరోజు ముందు షారుక్ హీరోగా నటించిన డుంకి సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక రాజ్ కుమార్ హిరాణి లాంటి స్టార్ డైరెక్టర్ షారుక్ ఖాన్ కాంబో కావడంతో  భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. దీంతో సలార్కు థియేటర్లు తగ్గుతాయి. అదే రోజు  బాక్సాఫీన్ ను ఊపేసిన ఆక్వా మ్యాన్ సీక్వల్ కూడా రాబోతుంది. దీంతో సలార్ మూవీకి షోస్ కౌంట్ తగ్గే ఛాన్స్ ఉంది. దీంతో ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన కాకుండా సంక్రాంతికి పోస్టు ఫోన్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: