సందీప్ మాస్టర్.. 8 వారాలకు ఎంత సంపాదించాడో తెలుసా?
బిగ్ బాస్ షో మొదలైన నాటి నుంచి కూడా ప్రతివారం లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఏడు వారాలపాటు ఏడుగురు లేడి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ పై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఎనిమిదో వారంలో మొదటి మెయిల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న సందీప్ మాస్టర్ చివరికి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికి వచ్చాడు అన్న విషయం తెలిసిందే. అయితే మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చిన సందీప్ ఇక ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ జరిగిన ప్రతిసారి కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లిన కంటెస్టెంట్ ఎంత పారితోషికం తీసుకున్నాడు అన్నది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయిన సందీప్ మాస్టర్ కూడా ఎంత పారితోషకం పుచ్చుకున్నారు అనేది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వారితో పోల్చి చూస్తే సందీప్ మాస్టర్ గట్టిగానే సంపాదించాడట. సందీప్ వారానికి 2.5 లక్షల పారితోషకం ఒప్పందంతో హౌస్ లోకి అడుగుపెట్టాడట. ఈ లెక్కన 8 వారాలకు గాను సందీప్ మాస్టర్ ఏకంగా 20 లక్షల వరకు పారితోషకం అందుకున్నాడని సమాచారం. అయితే ఇది బయట ఆట సందీప్ కి ఉన్న ఫేమ్ కి చెప్పుకోదగ్గ రెమ్యూనరేషన్ అని చెప్పాలి.