బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం ఈ నటి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఏక్ నిరంజన్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ నటి మాత్రం తన నటనతో తెలుగు సినీ ప్రేమికుల ద్వార మనసు దోచుకుంది.
ఇకపోతే ఈ నటి ఈ మధ్య కాలంలో హిందీ సినిమాల్లో నటిస్తూనే సౌత్ సినిమాల్లో కూడా నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ బ్యూటీ రాఘవ లారెన్స్ హీరోగా పి వాసు దర్శకత్వంలో రూపొందిన చంద్రముఖి 2 అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ లో కూడా ఈ నటి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలతో ఎన్నో సార్లు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్ర కారు ప్రేక్షకులను అలరిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే బ్లూ కలర్ లో ఉన్న అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.