పెళ్లి చూపులు మూవీ తో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి , టాక్సీవాలా , గీత గోవిందం లాంటి విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు కొంత కాలం క్రితమే ఖుషి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో విజయ్ హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించబోతున్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం నుండి తనకు టాక్సీవాలా మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందించిన దర్శకుడు రాహుల్ సంకుర్తియన్ దర్శకత్వంలో విజయ్ మరో మూవీ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్ కొన్ని రోజుల క్రితమే విజయ్ కి ఓ కథను వినిపించినట్లు ఆ కథ చాలా భాగం విజయ్ కి నచ్చినప్పటికీ కొంత భాగం మాత్రం మార్పులను ... చేర్పులను సూచించినట్లు ప్రస్తుతం దర్శకుడు ఈ సినిమాలోని కొంత భాగాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అన్ని కుదిరితేనే ఈ మూవీ ఓకే అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అంతా సెట్ అయితే ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.