బిగ్ బాస్ హౌస్ లో.. ఆయన క్యారెక్టర్ వదిలేసాడు : పూజ మూర్తి

praveen
కేవలం తెలుగులో మాత్రమే కాదు అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ అయ్యి బుల్లితెర హిస్టరీలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అనే పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. ఇక ఎన్నో సంవత్సరాల నుంచి ఈ షో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది అని చెప్పాలి. ఇక ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్ట్ తో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ప్రేక్షకులందరూ కూడా బ్రహ్మరథం పడుతూ.. టాప్ రేటింగ్స్ అందిస్తూ ఉన్నారు. ఇక తెలుగులో కూడా ప్రస్తుతం బిగ్బాస్ ఏడవ సీజన్ ప్రసారమవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఏకంగా ఏడు వారాలను ముగించుకుంది ఈ సీజన్.


 అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరూ కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ దగ్గరవ్వడం సర్వసాధనం. అయితే ఇలా హౌస్ లో కొన్నాళ్లపాటు కొనసాగి తర్వాత ఏదో ఒక సమయంలో ఎలిమినేట్ అయి బయటికి వస్తూ ఉంటారు కంటెస్టెంట్స్. అయితే ఇలా బయటికి వచ్చిన వారు ఎవరైనా బిగ్బాస్ హౌస్ గురించి ఏదైనా కామెంట్స్ చేస్తే మాత్రం అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇటీవల ఏడో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన పూజ మూర్తి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.


 అమర్ దీప్ గురించి కామెంట్స్ చేసింది పూజ మూర్తి. అమర్దీప్ నాకు బయట బాగా తెలుసు. కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత మాత్రం అతను పూర్తిగా మారిపోయాడు. తన ఒరిజినల్ క్యారెక్టర్ ని వదిలేసుకున్నాడు. నేను అందగాడిని అంటూ రెచ్చిపోయే అమర్ దీప్.. అక్కడ పూర్తిగా డీల పడిపోయాడు. నేను అతనితో కలిసి పని చేశాను. బయట నేను చూసిన అమర్ లోపల కనిపిస్తున్న అమర్ మాత్రం ఒక్కటి కాదు. అతను తన ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కూలిపోయాడు అంటూ అమర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది పూజ మూర్తి. శివాజీ, ప్రశాంత్ యావర్లను ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాడని.. కానీ ఈ విషయం చెబితే ఆయన ఒప్పుకోడు అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: