అయ్యయ్యో.. ఈ హారోయిన్ల చేతిలో ఒక్క సినిమా లేదు తెలుసా?

praveen
సాధారణంగా  సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ అదృష్టం కూడా అంతే కావాలి అని చెబుతూ ఉంటారు. ఇలాంటి అదృష్టం కలిసి వస్తే కాస్త టాలెంట్ తక్కువగా ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా అవతారం ఎత్తుతూ ఉంటారు. అయితే ఇలాంటి అదృష్టం కలిసి రాకే టాలెంట్ ఉన్న కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీలో కనుమరుగు అవుతూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి కాలం నడుస్తుంది అని ముందుగా ఊహించడం చాలా కష్టం. మరి ముఖ్యంగా హీరోయిన్ల కెరియర్ కాలం చాలా తక్కువ అని చెబుతూ ఉంటారు. అందుకే ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న విధంగా హీరోయిన్లు చాలా సినిమాలను ఒప్పుకుంటూ ఉంటారు. అయితే ఒకప్పుడు బిజీగా ఉన్న హీరోయిన్లు ఇప్పుడు కొంతకాలం నుంచి చేతిలో ఒక్క అవకాశం లేక ఖాళీగా ఉంటున్నారు. అలాంటి హీరోయిన్ల లిస్టు చూసుకుంటే..

 అనుష్క శెట్టి : సూపర్ అనే సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన అనుష్క శెట్టి దాదాపు దశాబ్ద కాలానికి పైగానే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. అయితే గత కొంతకాలం నుంచి సినిమాలు వేగంగా చేయడం లేదు ఈ ముద్దుగుమ్మ. మొన్నటికి మొన్న మిస్ సెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు తెలుగులో ఈ అమ్మడి చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు.

 సమంత : టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ఎవరు అంటే అందరూ సమంత పేరు చెప్పేవారు. కానీ గత కొంతకాలం నుంచి మయోసైటిస్ వ్యాధి బారిన పడి సినిమాలను తగ్గించేసింది. ఇక ఇప్పుడు ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేందుకు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చేసింది. అయితే ఈ ఏడాది విడుదలైన ఖుషి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది సమంత. కాని ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం.

 రకుల్ ప్రీత్  : రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి దాదాపు రెండేళ్లు గడిచిపోతుంది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపోలం తర్వాత ఒక్క సినిమా కూడా టాలీవుడ్ లో చేయలేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో ఒక్క సినిమా కూడా దక్కించుకోలేక పోతుంది.


 కృతి శెట్టి : ఉప్పెన సినిమాతో ఉప్పెనల దూసుకొచ్చిన ప్రతి శెట్టి వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారింది. కానీ గత ఆరు నెలల నుంచి కృతికి అస్సలు కాలం కలిసి రావట్లేదు. ప్రస్తుతం మలయాళ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ కు.. ఆరు నెలల నుంచి తెలుగులో మాత్రం ఒక సినిమా చేయలేదు. ఇక ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో కూడా కొత్త సినిమాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: