
వరల్డ్ వైడ్ గా ఇండియన్ టాప్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలు ఇవే..!!
ముందుగా ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన మల్టీస్టారర్ మూవీ RRR.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. ఇండియా వాడిగా మొదటి రోజు ఓపెనింగ్స్ గ్రస్ సాధించిన సినిమాలలో మొదటి స్థానంలో ఉన్నది. ఆ తర్వాత ప్రభాస్ రానా కాంబినేషన్లో వచ్చిన బాహుబలి-2 సినిమా రెండవ స్థానంలో స్థానాన్ని సంపాదించుకుంది. మూడవ స్థానంలో డైరెక్టర్ ప్రశాంత్ నిల్, యశ్ కాంబినేషన్లో వచ్చిన కే జి ఎఫ్ చాప్టర్-2 సినిమా ఉన్నది.
ఇటీవలే డైరెక్టర్ లోకేష్ కనకరాజు కోలీవుడ్ హీరో విజయ్ దళపతి కాంబినేషన్లో వచ్చిన లియో సినిమా కూడా నాలుగవ స్థానంలో స్థానాన్ని సంపాదించుకుంది. ఐదవ స్థానంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రోహిత్ హీరో ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన రామాయణ కథాంశం ఆది పురుష్ చిత్రం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇండియన్ సినిమాల నుంచి అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇవి నిలిచాయి. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు కూడా చేరే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇటీవల పాన్ ఇండియా చిత్రాలహవా ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువగా కొనసాగుతోంది చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని భాషలలో సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటు ఉన్నారు.