కొత్త టాలెంట్ చూపించిన శ్రీలీల.. క్లిక్ అయితే మరో 10 ఏళ్ళు తిరుగుండదు?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే టాలెంట్ ఎంత ఉన్న అదృష్టం కూడా ఆవగింజంత ఉండాలి. ఆ అదృష్టం లేక ఎంతో మంది  సెలబ్రిటీలు ఇండస్ట్రీలో కనుమరుగైన  సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు అదృష్టానికి టాలెంట్ కి చిరునామాగా మారిపోయింది శ్రీ లీల. పెళ్ళిసందడి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్టు కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ధమాకా అనే సినిమాతో ఏకంగా భారీ హిట్ కొట్టిన శ్రీలీల స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ ప్రస్తుతం బిజీ హీరోయిన్గా మారిపోయింది.


 మొన్నటి వరకు పూజా హెగ్డే, కృతి శెట్టి, రష్మిక మందన్న అంటూ ముగ్గురు హీరోయిన్లు వరుసగా అవకాశాలు అందుకునేవారు. కానీ ఇప్పుడు ఈ హీరోయిన్ల అందరి అవకాశాలను కూడా శ్రీలీల దక్కించుకుంటుంది. ఇక హీరోలతో సమానంగా డాన్సులు చేస్తూ అదరగొడుతుంది. ఇక తన అందం అభినయంతో కుర్ర కారు మతిపోగొడుతుంది ఈ సొగసరి. అయితే ఇటీవలే బాలయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. బాలయ్య హీరోగా కాజల్ హీరోయిన్గా నటించిన భగవంతు కేసరి సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో నటించింది శ్రీ లీల.



 అయితే ఈ సినిమాలో తనలో దాగి ఉన్న సరికొత్త టాలెంట్ను చూపించింది. ఇప్పుడు వరకు డాన్సులతో అదరగొట్టడం నటనతో మెప్పించడం అందం అభినయంతో మెస్మరైజ్ చేయడం చేసిన శ్రీలీల భగవంతు కేసరి సినిమాలో మాత్రం తొలిసారి యాక్షన్ సీక్వెన్స్ లో నటించి అందరిని థ్రిల్ చేసింది. విజ్జి పాప అనే క్యారెక్టర్ లో ఒదిగిపోయి అదరగొట్టింది అని చెప్పాలి. ఇక శ్రీలలలో ఉన్న యాక్షన్ యాంగిల్ తో పాటు ఈ సినిమాలో చూపించిన ఎమోషన్ యాంగిల్ క్లిక్ అయింది అంటే మరో పదేళ్లు హీరోయిన్గా ఇండస్ట్రీలో తిరుగులేదు అని అటు సినీ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: