యానిమల్ సీన్స్ పై కాపీ మరకలు !
ఈ మూవీ కూడ ‘పఠాన్’ ‘జవాన్’ ‘టైగర్ 3’ ల రేంజ్ లో ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఈమధ్య విడుదల చేసినా టీజర్ చూసిన తరువాత ఈ మూవీ పై అంచనాలు బాగా పెరిగినప్పటికీ ఈ టీజర్ చూసిన తరువాత సందీప్ వంగా సమర్థత చుట్టూ కాపీ మరకలు అంటుకుంటున్నాయి. ఈసినిమాలో హీరో ముందు సౌమ్యుడిగా ఉంటూ తర్వాత తండ్రి కోసం మరణ శాసనాలు రాసే గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడు. ఈ సీన్స్ ను చాల ఇంటెన్స్ గా తీశాడాని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే ఈ సీన్స్ తీయడంలో సందీప్ వంగా కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి తీసుకున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఫిఫ్టీ షేడ్స్ అఫ్ గ్రేలో హెలికాఫ్టర్ సన్నివేశాన్ని పూర్తి కాపీ కొడుతూ ఈమూవీలో తీశాడని ఒక ప్రచారం జరుగుతోంది.
ఇక ఈసినిమాలో హీరో తడిసిన చొక్కాతో చేతిలో చిన్న గొడ్డలి పట్టుకుని విలన్స్ ను ఊచ కోత కోసే సీన్ కొరియన్ మూవీ ఓల్డ్ బాయ్ నుంచి సందీప్ వంగ కాపీ కొట్టాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేవలం ఒక్క ఈసినిమాకు సంబంధించి విడుదల అయిన టీజర్ ను ఆధారంగా తీసుకుని వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ఇవి..