అలా చేసి తండ్రి పైనున్న ఎమోషనల్ ను బయటపెట్టిన రాంచరణ్....!!

frame అలా చేసి తండ్రి పైనున్న ఎమోషనల్ ను బయటపెట్టిన రాంచరణ్....!!

murali krishna
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా మరోవైపు కమర్షియల్ యాడ్ చేస్తూ కూడా భారీగానే సంపాదిస్తున్నారు.ఇలా సినిమాలు యాడ్స్ ద్వారా రామ్ చరణ్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఎన్నో యాడ్స్ ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా సరికొత్త ఆడ్ ద్వారా రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వస్తూ తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమను తెలియజేయడమే కాకుండా నాన్నను చూసి నేర్చుకున్నాను అంటూ ఈయన చెప్పినటువంటి డైలాగ్స్ అదిరిపోయాయని చెప్పాలి. మాన్యవర్ అనే బట్టలు సంస్థ కోసం చరణ్ ఈ కొత్త యాడ్ చేశాడు.ఇందులో భాగంగా రామ్ చరణ్ నాన్న అడుగులో అడుగు వేస్తూ చాలా నేర్చుకున్నాను.

ఆయనని చూసే పనిలో పట్టుదలతో ఉండాలని, మనల్ని ప్రేమించే వారిని ఎక్కువగా మనకంటే ప్రేమించాలని తెలుసుకున్నాను. తన గురించి ఆలోచనని వారికోసం ఆలోచించడం నాన్నను చూసే నేర్చుకున్నాను, జీవితంలో నిలబడానికి నాన్నని చూసే నేర్చుకున్నాను అంటూ రామ్ చరణ్ ప్రతి ఒక్క నాన్న కొడుకుల కథని ఒక చిన్న యాడ్ లో చూపించేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన అభిమానులందరూ కూడా ఈ వీడియోలో నాన్న పాత్రలో చిరంజీవి చేసే ఉంటే ఈ వీడియో మరో లెవెల్ లో ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఇలా ఈ యాడ్ ద్వారా రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి పై తనకున్నటువంటి అభిమానాన్ని ఎమోషన్ ని బయటపెట్టారని స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా ఈయన ప్రతి విషయాన్ని తండ్రి నుంచి నేర్చుకొని నేడు తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.ఇక ఈ వీడియో చూసినటువంటి చరణ్ ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈయన ప్రస్తుతం ఈ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది. వరుణ్ తేజ్ పెళ్లి కావడంతో తన భార్య కూతురుతో కలిసి ఈయన ఇటలీకి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: