వామ్మో.. ఒక్క సినిమాకి.. ఎస్ జె సూర్య అంత డిమాండ్ చేస్తున్నాడా?
ఇటీవల విశాల్ హీరోగా వచ్చిన మార్క్ ఆంటోనీ సినిమాలో కూడా ఫుల్ లెన్త్ పాత్రలో నటించాడు ఎస్ జె సూర్య. ఇక తన నటనతో అందరినీ మెప్పించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగలడు సూర్య. అందుకే అతని కోసం దర్శకులు ప్రత్యేకమైన పాత్రలు రాసుకుంటున్నారు అనడంలోనూ సందేహం లేదు అని చెప్పాలి. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చిందంటే చాలు పారితోషకం కూడా అమాంతం పెంచేయడం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఎస్ జే సూర్య కూడా ఇదే చేస్తున్నాడట. ఇటీవలే నాని కొత్త సినిమా కోసం ఎస్ జే సూర్యని సంప్రదిస్తే ఏకంగా 10 కోట్ల పారితోషకం డిమాండ్ చేసినట్లు ఒకటాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
10 కోట్లు అంటే అది ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలు తీసుకునే పారితోషకం అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే ఒక చిన్న సినిమాని ఎంతో సులభంగా 10 కోట్లతో తీసేయొచ్చు. అయితే వైవిద్యమైన నటుడుగా పేరు ఉండడం వల్ల ఎస్ జె సూర్య ఈ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే సూర్య 10 కోట్లు అడగడంతో ఇక అతనికి బదులు సినిమాలో మరొక నటుడిని తీసుకున్నట్లు టాక్. కాగా నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన అంటే సుందరానికి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే కాంబినేషన్లో డివివి దానయ్య నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కుతూ ఉండగా.. ఈ మూవీ కోసమే ఎస్ జె సూర్యని సంప్రదించినట్లు తెలుస్తుంది.