"వార్ 2" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
కొంత కాలం క్రితం విడుదల అయినటువంటి వార్ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. వార్ మూవీ లో హృతిక్ రోషన్ హీరోగా నటించగా ... టైగర్ ష్రాఫ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే వార్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా "వార్ 2" మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది.


ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు స్పెయిన్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే అయాన్ ముఖర్జీ ఈ సినిమాను అత్యంత హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నట్లు అవి కూడా కళ్ళు చెదిరే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ లాంటి భారీ క్రేజ్ ఉన్న నటులు నటిస్తుండడంతో ఈ మూవీ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


ఇది ఇలా ఉంటే ఈ సినిమాను 2025 వ సంవత్సరం జనవరి 24 వ తేదీన విడుదల చేసే ప్లాన్ లో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరి కొంత కాలం తర్వాత ఈ మూవీ మేకర్స్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి ఎన్టీఆర్ కి ఈ మూవీ ఎలాంటి క్రేజ్ ను హిందీ సినీ పరిశ్రమలో తీసుకువస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: