రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త.. గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్..!

Divya
రామ్ చరణ్,  కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ చేంజర్.. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడో మొదలైంది కానీ ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు అభిమానుల ఎదురు చూపులకు తెర దించుతూ ఈ సినిమా నుంచి ఫస్ట్ పాటను దసరా సందర్భంగా అక్టోబర్ 24 వ తేదీన రిలీజ్ చేయబోతున్నాము అంటూ చిత్ర బృందం అభిమానులకు శుభవార్త తెలిపింది. ఇక ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే వెలువడనుంది అని సమాచారం.  ముఖ్యంగా కంప్లీట్ మాస్ ట్యూన్ తో రామ్ చరణ్ ఫాన్స్ లో ఊపు తెప్పించేలా మొదటి పాట ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఎస్ఎస్ తమన్ ఈ సాంగ్ రికార్డింగ్ పనులతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో దాదాపు రూ.200 కోట్లు బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా శంకర్ గత సినిమాల తరహాలోనే సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను మేలవించి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక ఇందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తూ ఉండగా.. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు ఇప్పటికే పోస్టర్లు మనకు స్పష్టం చేశాయి.
వినయ విధేయ రామ తర్వాత వీరిద్దరూ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి,  నవీన్ చంద్ర , ఎస్ జె సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాదులో వేగంగా జరుగుతున్నాయి . ప్రధాన తారాగణం పై శంకర్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు.. వచ్చే ఏడాది సెలవుల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: