సమంత కు అలాంటి మెసేజెస్ చేసింది ఎవరో తెలుసా....??
ఆ వ్యాధి నయం అయ్యాక మళ్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. తనకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలే తను ఖుషీ సినిమాలో నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఇక.. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఓ వ్యక్తి తనను బాగా విసిగిస్తున్నాడట. వస్తావా అంటూ అర్ధరాత్రి మెసేజ్ లు చేస్తున్నాడట. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. అసలు ఏం జరిగింది అంటే సమంత జిమ్ ట్రెయినర్ తనకు అర్ధరాత్రి మెసేజ్ చేశాడట. ఉదయమే జిమ్ కు వస్తున్నావా అని అడిగాడట. దీంతో నేను రాను.. బాడీ పెయిన్స్ ఉన్నాయి. లీవ్ తీసుకుంటా అని చెప్పిందట సమంత.లీవ్ తీసుకుంటా అని చెప్పినా కూడా జిమ్ ట్రెయినర్ వినలేదట. తనతో ఎలాగైనా వర్కవుట్ చేయించాలని అర్ధరాత్రి అలా మెసేజ్ చేశారట. అయినా కూడా ట్రెయినర్ ఇక్కడే ఉన్నా వస్తావా అని ట్రెయినర్ అడిగాడట. రానని చెప్పినా కూడా వినకుండా సమంతను తీసుకెళ్లి బలవంతంగా తనతో వర్కవుట్స్ చేయించారంటూ దానికి సంబంధించి పోస్ట్ చేసింది సమంత. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.