"హాయ్ నాన్న" యూఎస్ఏ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం దసరా మూవీ తో అదిరిపోయే రేంజ్ పాన్ ఇండియా సక్సెస్ ను అందుకున్నాడు. ఇక దసరా లాంటి భారీ సక్సెస్ తర్వాత ఈ నటుడు హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మొదట డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆ మూవీ బృందం ప్రకటించడంతో ఆ సినిమాతో పోటీ అవసరం లేదు అని భావించిన ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన కాకుండా డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ప్రమోషన్ లను కూడా భారీగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు.
 


ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను "యుఎస్ఎ" లో ప్రత్యంగిరా సినిమాస్ ... ఏ ఏ క్రియేషన్స్ ఫణి ముత్యాల సంస్థలు విడుదల చేయబోతున్నట్లు అలాగే ఈ మూవీ ని "యుఎస్ఎ" లో డిసెంబర్ 6 వ తేదీనే ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ రెండు సంస్థలు కూడా ఈ సినిమాలు భారీ ఎత్తున "యూఎస్ఏ" లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ  మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. మరి ఈ మూ వీతో నాని ఇండియా వ్యాప్తంగా ఏ స్థాయి క్రేజ్ ను సాధిస్తాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: