3 దశాబ్దాల తర్వాత.. ఆ రికార్డు పై కన్నేసిన బాలయ్య?

praveen
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలను చేయడంలో యంగ్ హీరోలకు మించిన జోరుని చూపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే..  మరోవైపు సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారు. ఈ రెండు చాలవు అన్నట్లు మరోవైపు ఆహా వేదికగా అన్ స్టాపబుల్ కార్యక్రమంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి బాలయ్య వరుసగా సూపర్ హిట్లను సాధిస్తూ ఉండడం గమనార్హం.

 వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో అఖండ సినిమాతో అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు బాలకృష్ణ. ఇక అన్ స్టాపబుల్ తో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని  దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇక ఇప్పుడు బాలకృష్ణ హ్యాట్రిక్ పై కన్నేసాడు అన్నదే తెలుస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంతు కేసరి అనే సినిమా చేయగా.. ఈ సినిమా ఈ నెల 19వ తేదీన విడుదల కాబోతుంది. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బాలయ్య ఒక రికార్డు పై కన్నేసాడట. ఏకంగా హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటున్నాడట  అయితే అనిల్ రావిపూడి ఓటమి ఎరుగని దర్శకుడు కావడంతో ఇక బాలయ్య హట్రీ కొట్టడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.

 అయితే గతంలో బాలయ్య కెరియర్లో చాలానే హిట్ మూవీస్ ఉన్నప్పటికీ బ్యాక్ టు బ్యాక్ బాలయ్య హిట్లు కొట్టింది మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. నరసింహారెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత గతంలో బాలయ్య చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత మరో హిట్టు రావడానికి సమయం పట్టింది. 1993 - 94లో బంగారు బుల్లోడు, భైరవద్వీపం సమయంలోనే వరుసగా రెండు హిట్స్ కొట్టారు. ఇక ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత ఏకంగా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: