లియో కు రామ్ చరణ్ మ్యానియా సపోర్ట్ !

Seetha Sailaja
దసరా రేస్ కు విడుదల అవుతున్న తమిళ టాప్ హీరో విజయ్ ‘లియో’ మూవీ ట్రైలర్ కు కొంత నెగిటివ్ స్పందన వచ్చినప్పటికీ ఆమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ రీత్యా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు. దర్శకుడు లోకేష్ కనకారాజ్ తాను చేసే సినిమాల ప్రమోషన్ చాల డిఫరెంట్ గా చేస్తాడు.


అందులో భాగంగా వచ్చే వారం తెలుగు తమిళ భాషలతో పాటు బాలీవుడ్ లో విడుదలకాబోతున్న ఈమూవీ  ప్రమోషన్ లో ప్రచారంలోకి వచ్చిన ఒక గాసిప్ తెలుగు రాష్ట్రాలలో ‘లియో’ మ్యానియాను పెంచుతొంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈమూవీలో రామ్ చరణ్ చిన్న అతిధి పాత్రలో కనిపిస్తాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన హడావిడి కొనసాగుతోంది.


అయితే ఈ గాసిప్పులను ఈమూవీ యూనిట్ ఖండించక పోవడంతో ప్రచారంలోకి వచ్చిన ఈ న్యూస్ వాస్తవం అవునా కాదా అన్న కన్ఫ్యూజన్  లో  రామ్ చరణ్ అభిమానులు ఉన్నారు. నిజానికి ఇలాంటి గాసిప్పు బయటకు రావడానికి ఒక కారణం ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన ఒక ధియేటర్లో ఈసినిమాకు సంబంధించిన స్టార్ క్యాస్టింగ్ లిస్టులో రామ్ చరణ్ పేరుంది అంటూ ప్రచారం మొదలైంది.


ఈవార్తల విషయంలో రామ్ చరణ్ పిఆర్ టీమ్ కూడ మౌనంగా ఉండటంతో ఈ వార్తలు నిజమా అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి. అయితే దర్శకుడు లోకేష్ కనకరాజ్ త్వరలో ప్రభాస్ తో సినిమాతో తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో ‘లియో’ మూవీలో అతిధి పాత్రలో కనిపిస్తే ప్రభాస్ కనిపిస్తాడు కాని రామ్ చరణ్ ఎందుకు కనిపిస్తాడు అంటూ ప్రభాస్ అభిమానులు వాదిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఈసినిమాలో ఒక తెలుగు హీరో అతిధి పాత్రలో కనిపిస్తాడు అంటూ జరుగుతున్న ప్రచారం వల్ల ‘లియో’ మ్యానియా తెలుగు రాష్ట్రాలలో బాగా పెరిగింది అనుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: