సైంధవ్ నిర్ణయంతో వేడెక్కిపోతున్న టాలీవుడ్ !

Seetha Sailaja
‘సలార్’ డిసెంబర్ 22న విడుదల కావడానికి నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్ణయ ప్రభావం సంక్రాంతి సినిమాల రిలీజ్ ను అతలాకుతలం చేస్తున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. సీనియర్ హీరో వెంకటేష్ నటించిన ‘సైంధవ్’ మూవీని కూడ సంక్రాంతి రేస్ లో దింపుతున్నట్లు అధికారికంగా ప్రకటన రావడంతో టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ వర్గాలు షాక్ లో ఉన్నాయి.

‘ఎఫ్ 2’ తర్వాత వెంకటేష్ చాల ధైర్యంగా సంక్రాంతి సినిమాల మధ్య పోటీకి రావడంతో ఈమూవీ పై వెంకటేష్ కు ఉన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఇప్పటికే జనవరి 12 ‘గుంటూరు కారం’ ‘హనుమాన్’ తమ రిలీజ్ డేట్స్ విషయంలో మార్పులేదు అంటూ లీకులు ఇస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండ పరుశు రామ్ ల మూవీని కూడ సంక్రాంతి రేస్ లో దించి తీరాలని దిల్ రాజ్ భావిస్తున్నాడు. ఇప్పటికే రవితేజ ‘ఈగల్’ రంగంలో ఉన్నది.

ఈ రేస్ లో తాను కూడ ఉన్నాను అంటూ నాగార్జున ‘నాసామిరంగా’ అంటూ ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడ చేశాడు. ఇలా ఒక్కసారిగా సంక్రాంతిని నమ్ముకుని ఇన్ని భారీ సినిమాలు క్యూ కడుతున్న పరిస్థితులలో ఇన్ని సినిమాలకు ధియేటర్స్ ఎక్కడ దొరుకుతాయి దీనితో ఈ సంక్రాంతి రేస్ లో త్యాగం చేసే హీరో ఎవరు అంటూ అప్పుడే ఇండస్ట్రీ వర్గాలలో ఊహాగానాలు మొదలైపోయాయి. సంక్రాంతి తెలుగు ప్రజలకు పెద్ద పండుగ కాబట్టి ఎన్ని సినిమాలు విడుదల అయినా అన్ని సినిమాలను ప్రేక్షకులు చూస్తారు అన్న నమ్మకాన్ని పెంచుకుని ఇన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి అన్న అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వెంకటేష్ 'సైంధవ్' సంక్రాంతి రేస్ లోకి ఎంటర్ కావడంతో సంక్రాంతి రేస్ మరింత కన్ఫ్యూజుడు గా మారింది అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనితో వెంకటేష్ తన నిర్ణయం పై ఎంతవరకు నిలబడతాడు అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: