కోలీవుడ్ లో రీమేక్ అవ్వబోతున్న బేబీ సినిమా.. ఎప్పుడంటే..!?

Anilkumar
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో వచ్చిన బేబీ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంట్టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమాను సాయి రాజేష్ తెరకెక్కించారు. నేటి జనరేషన్ ఎలా ఉంది అన్న విషయాన్ని చాలా చక్కగా చూపించడు దర్శకుడు. దీంతో యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. చాలా ఏళ్ల తర్వాత థియేటర్స్ అన్ని కూడా హౌస్ ఫుల్ బోర్డుతో చూడడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకు

 ఈ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే అది బేబీ సినిమా అని అంటున్నారు. థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీ లో సైతం ఈ సినిమా ఊహించని రేంజ్ లో దూసుకుపోతూ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇందులో వైష్ణవి చైతన్య ఆనంద్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడంతో చాలామంది సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం 10 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా 100 కోట్ల మార్కుకు చాలా దగ్గరలోకి వచ్చి ఆగిపోయింది.

చాలా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ నేపద్యంలోనే బేబీ సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమాను తమిళ్ లో సైతం రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దానితోపాటు ఒరిజినల్ వెర్షన్ నూ తెరకెక్కించిన సాయి రాజేష్ తమిళ రీమేక్ ను కూడా చేయబోతున్నారు అని సమాచారం. ఎస్ కే ఎన్ తో కలిసి ఒక తమిళ మీడియా సంస్థ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: