తన పాటలతో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలు సినిమాల్లో సైతం నటించి మెప్పించింది ఈ చిన్నది. చాలా చిన్న మారుమూల గ్రామంలో జన్మించి ఇప్పుడు పెద్ద సింగర్ అయింది. ప్రస్తుతం మంగ్లీ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంది. మొదట్లో v6 లో మాట కారి మంగ్లీ షో తో అందరినీ మెప్పించింది. అలా తన మాటలతో బోనాలు శివుడి జానపద పాటలను పాడి అందరి మనసులను దోచుకుంది. అలాగే బతుకమ్మ పాటలు సైతం పాడేది. మొదటిగా శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో పాట పాడి సింగర్ గా
మంచి పేరు తెచ్చుకుంది. దాని తర్వాత ఈ పాట బాగా ఫేమస్ అవడంతో మంగ్లీకి వరుస సినిమాల్లో పాటలు పాడే అవకాశం వచ్చింది. అలా మంగ్లికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగర్ గా మంచి గుర్తింపు వచ్చింది. లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఈమె అసలు పేరు సత్యవతి రాథోడ్. కానీ మంగ్లి గా అందరికీ సుపరిచితం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విద్యాలయం నుండి కర్ణాటక మ్యూజిక్ లో డిప్లమా పూర్తి చేసింది మంగ్లీ. దాని తర్వాత యాంకర్ గా తన కెరీర్ను ప్రారంభించింది. మ్యూజిక్ పై తనకున్న ఆసక్తి ఇవాళ మంగ్లీని ఇంత పెద్ద సింగర్ని చేసింది.
మొదట చాలా ప్రైవేట్ ఆల్బమ్ చేసేది. అవన్నీ మంగ్లీని ఈ స్థాయికి తీసుకువచ్చాయి. దానితో పాటు పండగల సమయంలో మంగ్లీ ప్రత్యేకమైన పాటలను పాడుతుంది. గ్రామ గ్రామానికి తన పాట వినిపించేలా ఆ పాటలను డిజైన్ చేసుకుంటుంది. ఇక ఆ ఆల్బమ్స్ మంగ్లీ నీ వెండితెరకు పరిచయం చేసాయి. ఇప్పుడు ప్లే బాయ్ సింగర్ గా స్థిరపడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగ్లికీ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా మంగ్లీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. ఈమె పెళ్లి చేసుకోబోయేది తమ బంధువుల అబ్బాయి అని అంటున్నారు. వరుసకు బావ అయ్యే వ్యక్తిని సింగర్ మంగ్లీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని అంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో మంగ్లీ పెళ్లి పీటలు ఎక్కి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!