జబర్దస్త్ నుండి వెళ్లిపోయాక.. వీళ్ళ పరిస్థితి ఇలా మారిపోయిందా?

praveen
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కార్యక్రమం ఎంతమంది అప్కమింగ్ కమీడియన్స్ కి లైఫ్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా నవ్వులు పంచుతునే.  ఇంకోవైపు ఇక ఇండస్ట్రీలో నిలుదొక్కుకోవాలి..  మంచి పాపులారిటీ సంపాదించుకోవాలని ఆశపడిన ఎంతో మంది అప్కమింగ్ కమీడియన్స్ కి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది  ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చడమే కాదు తెలుగు బుల్లితెర  ప్రేక్షకులందరికీ కూడా దగ్గర చేసింది జబర్దస్త్. అయితే ఇలా జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించిన వారు ఆ తర్వాత ఇక సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు.

 అయితే కొంతమంది కమెడియన్స్ మాత్రం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి ఇక ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు అన్నది తెలుస్తుంది  ఇంతకుముందు జబర్దస్త్ షోలో టాప్ టీమ్ లీడర్లుగా కొనసాగిన హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, చమ్మక్ చంద్ర లాంటి వారు ఈ షో నుంచి బయటికి వచ్చేసారు. సుధీర్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక హైపర్ ఆది ఈటీవీలోనే మిగతా కార్యక్రమాలలో కనిపిస్తున్నాడు. అయితే అప్పారావు లాంటి వాళ్ళు మాత్రం బయట ఎక్కడా కనిపించట్లేదు.. ఇండస్ట్రీలో కూడా పెద్దగా సినిమా అవకాశాలు రావట్లేదు.

 అచ్చం ఇలాగే జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన ముక్కు అవినాష్ కూడా పెద్దగా అవకాశాలు లేక చిన్న చిన్న ప్రోగ్రాములు చేసుకుంటూ కనిపిస్తున్నాడు. ఇక సినిమా అవకాశాలు మాత్రం అస్సలు రావట్లేదు అని చెప్పాలి. బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి  జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన ముక్కు అవినాష్ కి ఇక ఇప్పుడు కష్ట కాలం నడుస్తుంది అంటూ ఒక టాక్ వినిపిస్తూ ఉంది. అయితే గతంలో జబర్దస్త్ లో ఉన్నంతకాలం అవినాష్ కెరియర్ సాఫీగానే సాగింది.  తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా మంచి పారితోషకం అందుకున్నాడు. కానీ ఇప్పుడు అడపా దడపా పారితోషికం మాత్రమే కాదు అడపాదప ప్రోగ్రాంలలో కనిపిస్తూ ఉన్నాడు అవినాష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: