'అదుర్స్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

Anilkumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో అదుర్స్ సినిమా కూడా ఒకటి. వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో బ్రాహ్మణుడి పాత్రలో తెగమెప్పించాడు ఎన్టీఆర్. అంతేకాకుండా బ్రహ్మానందం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీరిద్దరి మధ్య సన్నివేశాలు ఈ సినిమాకే హై లైట్ గా నిలిచాయి.
 సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించారు. అందులో నరసింహ చారి క్యారెక్టర్ మాత్రం అందరికీ గుర్తుండిపోయింది. ఆ పాత్రలో ఎన్టీఆర్ పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇప్పటికీ ఈ మూవీ కామెడీ సీన్స్ ని చాలామంది యూట్యూబ్లో 

రిపీటెడ్ గా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఎవర్ గ్రీన్ మూవీ 'అదుర్స్' ఇప్పుడు రీ రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండడంతో చాలా రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అదుర్స్ మూవీ థియేటర్స్ లోకి మళ్లీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు 'అదుర్స్' మూవీ రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయింది. నవంబర్ 18న 'అదుర్స్' మూవీ థియేటర్స్ లో 4k వెర్షన్ తో రీరిలీజ్ కాబోతోంది. సోమవారం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావడం జరిగింది. నిజానికి ఈ ఏడాది మార్చి నెలలోనే 'అదుర్స్' రీరిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల అప్పట్లో వాయిదా పడింది. 

దీంతో ఎట్టకేలకు 4k ఫార్మేట్ లో నవంబర్ 18న అదుర్స్ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక 'అదుర్స్' రీరిలీజ్ కాబోతుందనే విషయం తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోసారి బిగ్ స్క్రీన్ పై చారి, భట్టుల నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ని చూసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా హీరోయిన్స్ గా నటించగా.. రమ ప్రభ, షియాజీ షిండే, బ్రహ్మానందం, నాజర్, తనికెళ్ల భరణి, మహేష్ మంజ్రేకర్, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు పోషించారు. వల్లభనేని వంశీ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతమందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: