'స్కంద' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతో తెలుసా..!!

Anilkumar
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన స్కంద సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ను చూడడానికి సినీ లవర్స్ క్యూ కడుతున్నారు.
 సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కినా రెండో రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ లో ఎక్కువ శాతం తగ్గుదలే కనిపించింది. సెప్టెంబర్ 28న  థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ వారాంతంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.33 కోట్ల గ్రాస్ ని రూ.17.5 కోట్ల షేర్ ని రాబట్టి యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. గురువారం రోజున రూ.14 కోట్ల గ్రాస్, రూ.8 కోట్లకు పైగా షేర్ ని రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత రోజు నుంచి వసూళ్లలో 60 శాతం తగ్గుదల కనిపించింది. రెండో రోజు నుంచి సినిమాకి టాక్ ఏమంత బాగా లేకపోవడంతో వీకెండ్ ముగిసే సరికి కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ.40 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. కానీ స్కంద మూవీకి వారాంతంలో బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.16 కోట్ల షేర్ రావటం గమనార్హం.
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నుండి 'స్కంద' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
గురువారం : రూ.12.75కోట్లు
శుక్రవారం : రూ.6 కోట్లు
శనివారం : రూ.6 కోట్లు
ఆదివారం : రూ.6 కోట్లు
టోటల్ కలెక్షన్స్ : రూ.32.75 కోట్లు
తెలుగు రాష్ట్రాలపరంగా పర్వాలేదనిపించుకున్న 'స్కంద' మిగతా ఏరియాల్లో పేలవమైన ప్రదర్శనను కనపరిచింది. కర్ణాటకలో రూ.2 కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈ చిత్రం ఓవర్సీస్ లో ఫస్ట్ వీక్ 400k డాలర్స్ ను సంపాదించింది.
ఇక ఏరియాల వారిగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే..
 నైజాంలో రూ.11.50 కోట్లు గ్రాస్(రూ.5.75 కోట్ల షేర్)
ఆంధ్ర : రూ.13.50 కోట్లు గ్రాస్ ( రూ.7.15 కోట్ల షేర్)
AP/TS : రూ.29.50 కోట్లు గ్రాస్(రూ.16 కోట్ల షేర్)
కర్ణాటక : రూ.2 కోట్లు గ్రాస్(కోటి రూపాయలు షేర్)
రెస్టాఫ్ ఇండియా : రూ.1.25 కోట్లు గ్రాస్(0.50 కోట్లు షేర్)
ఇండియా వైడ్ టోటల్ కలెక్షన్స్ రూ. 32.75 కోట్లు గ్రాస్(రూ.17.50 కోట్లు షేర్) రాబట్టింది
ఇక ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద స్కంద ఫస్ట్ వీకెండ్ లో  రూ.43 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుంది.
ఆదివారం రోజున కలెక్షన్స్ లో కాస్త పెరుగుదల కనిపించినా 'స్కంద' కి సోమవారం రోజు కూడా కలిసిచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సోమవారం గాంధీ జయంతి సెలవు ఉంది. కాబట్టి ఆ రోజు కూడా వసూళ్లు బాగానే ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: