ఆ ఏరియాలో ట్రైలర్ లాంచ్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న "భగవంత్ కేసరి" మూవీ యూనిట్..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సూపర్ సాలిడ్ విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం అఖండ , మూవీ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వీర సింహా రెడ్డి మూవీ తో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మిస్తున్న భగవంత్ కేసరి అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ సినిమాలో బాలకృష్ణ కు కూతురు పాత్రలో కనిపించబోతుంది. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 8 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ను వరంగల్ లో విడుదల చేయబోతున్నట్లు అందుకోసం ఇప్పటికే వరంగల్ లో ఓ భారీ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ఆఖండ , వీర సింహా రెడ్డి లాంటి రెండు వరుస విజయాల తర్వాత బాలకృష్ణ నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఆయన అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో శ్రీకాంత్ ఒకేలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: