టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. రామ్ కెరియర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఈ సినిమా ముందు వరుసలో ఉంటుంది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడానికి ఇందులోని పాటలు సైతం బాగా ప్లస్ అయ్యాయి అని చెప్పాలి.
మణిశర్మ కంపోజ్ చేసిన మాస్ ఆల్బమ్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. రిలీజ్ కి ముందు సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అవ్వడానికి సాంగ్స్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. 'ఇస్మార్ట్ శంకర్' ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలవడంతో పాటు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కుతున్న
విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సీక్వెల్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయమై రకరకాల వార్తల వినిపించాయి. ఎట్టకేలకు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో సస్పెన్స్ వీడినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ కి అదిరిపోయే ఆల్బమ్ అందించిన మణిశర్మ నే మరోసారి 'డబుల్ ఇస్మార్ట్' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా మూవీ టీం ఫైనల్ చేసిన తెలుస్తోంది. ఇప్పటికే ఓ పాటకి సంబంధించిన ట్యూన్ తో పాటు ఫైనల్ కంపోజిషన్ కూడా ఓకే అయిపోయిందని అంటున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పుడు మణిశర్మ పేరు లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి జగన్నాథ్ తో ఏమో విభేదాలు ఉన్నాయని, పైగా పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ వైపు చిత్ర బృందం
మొగ్గు చూపుతుందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం అవన్నీ అవాస్తవాలని తెలిసింది. నిజానికి ఈ సినిమా కోసం ముందు తమన్, అనిరుద్ లాంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో మాట్లాడారట. కానీ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ లోపు పనులు జరగాలంటే వాళ్లతో కుదరదని చివరగా మణిశర్మకే ఓటేశారని అంటున్నారు. పైగా మొదటి భాగంలోని పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతో కొంత సీక్వెల్లో కూడా వాడడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో అంటే కష్టం. ఒకవేళ అది జరిగితే కాపీ రైట్ సమస్య కూడా వస్తుంది. ఇవన్నీ ఆలోచించే పూరి అండ్ టీం మణిశర్మనే ఫైనల్ చేసినట్లు సమాచారం.