'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ .!!

Anilkumar
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆయన సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు. నరసింహ పాత్రలో కొంత సమయం మాత్రమే కనిపించినా కూడా అందులో ఆయన స్టైల్ ఎనర్జీ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండడంతో ఆయనకి మంచి మార్కులే పడ్డాయి.
సినిమాలో ఆయన ఎంట్రీకి ఫ్యాన్స్ అరుపులతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. అలా జైలర్ లో భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన శివరాజ్ కుమార్ ఇప్పుడు  'ఘోస్ట్'(Ghost) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ కన్నడ తో పాటు అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ ని అందుకుంది. 

శివన్న ఈ సినిమా కోసం మొదటిసారి బౌండరీలు దాటి పాన్ ఇండియా వైడ్ సినీ లవర్స్ ని ఆకట్టుకుపోతున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. 'వన్స్ ఎ గ్యాంగ్ స్టర్ ఆల్వేస్ గ్యాంగ్ స్టర్' అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాపై కన్నడ నాట భారీ అంచనాలు ఉన్నాయి. శివరాజ్ కుమార్ తో పాటు ఉపేంద్ర, రాజ్ బి శెట్టి సైతం ఈ సినిమాలో నటిస్తుండడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా 'ఘోస్ట్' మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. కన్నడ తో పాటు అన్ని భాషల్లో ఈ ట్రైలర్ విడుదలైంది. మన తెలుగులో దర్శకరుడు రాజమౌళి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. 

'కే జి ఎఫ్' స్టైల్ లో ఓపెన్ అయ్యి కంప్లీట్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా భారీ యాక్షన్ సీన్స్ తో ట్రైలర్స్ సాగింది. టైలర్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేసారు. 'సామ్రాజ్యాలు సృష్టించే వాడిని చరిత్ర మర్చిపోతుందేమో గాని విధ్వంసం సృష్టించిన వాడిని ఎప్పుడూ మర్చిపోదంటూ" ఒక్క డైలాగ్ తోనే సినిమా మెయిన్ థీమ్ ని చెప్పేసారు. ఓ సాధారణ మనిషిగా ఉండే శివన్న కొన్ని కారణాలవల్ల మోస్ట్ వాలెంట్ మ్యాన్ గా మారి శత్రువులను చీల్చి చెండాడుతూ ఉంటాడు. ఇంతకీ శివన్న విధ్వంసం వెనక ఉన్న అసలు కారణాలేంటి? ఆయన ఎందుకలా చేశాడు? అనేది సినిమాలో చూపించబోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: