టార్గెట్ పూర్తి చేసుకోవడం స్కంద సినిమాకు కష్టమేనా..?

Divya
యంగ్ హీరో రామ్ పోతినేని,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ చిత్రం స్కంద. ఈ సినిమా మాస్ మసాలాగా తెరకెక్కించారు. గురువారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కావడం జరిగింది. బోయపాటి యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎంతోమంది హీరోలతో సైతం బోయపాటి సినిమాలను తెరకెక్కించి అందులో కూడా భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే మూడు రోజుల కలెక్షన్స్ కాబట్టి పర్వాలేదు అనిపించుకుంటోంది వాటి గురించి తెలుసుకుందాం.

స్కంద సినిమా మూడు రోజులలో మొత్తం దాదాపుగా 15.37 కోట్ల రూపాయల షేర్ తో పాటు 20 కోట్ల క్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం రోజు సెలవు కావడంతో కలెక్షన్స్ పరంగా బాగా వస్తాయనుకున్నారు చిత్ర బృందం కానీ శనివారం మధ్యాహ్నం షోలతో పోలిస్తే స్కంద సినిమా ఎలాంటి గ్రోత్ ను నిన్నటి రోజున చూపించుకోలేక పోయిందట. నిన్నటి రోజున కూడా చాలా నిరాశను పరిచినట్లు తెలుస్తోంది. కొద్దిపాటి నష్టాలతో సరిపెట్టుకొని అవకాశం ఉన్నట్లుగా సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు.

రామ్ మాస్ హీరోగా అనిపించుకునే కల అయితే ఈ సినిమాతో నెరవేరుచుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా చాలా దారుణమైన కలెక్షన్స్ రాబడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మీదట డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాలు చేయకపోవడమే మంచిదంటూ పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. శ్రీ లీల ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడు తన నటనతో కాస్త ప్లస్ అయింది స్కంద సినిమాకి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏ మేరకు అభిమానులను మెప్పించి లాభాల బాట పట్టించేలా చేస్తుందో చూడాలి మరి. ఇందులో రామ్ మాస్ హీరోగా చూపించిన తీరు బాగానే ఉన్న కానీ ఓవర్ డైలాగ్స్ ఓవర్ ఫైట్స్ కారణంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: