తారక్ మూవీ మేనియాలో.. కనిపించకుండ పోయిన చిరు సినిమా ఏదో తెలుసా?

praveen
మొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమ లో స్టార్ హీరోగా కొనసాగిన జూనియర్ ఎన్టీఆర్ ఇక త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారి పోయాడు అని చెప్పాలి. తన నటన తో ప్రపంచ సినీ ప్రేక్షకులందరికీ కూడా ఫిదా చేసేశాడు. దీంతో కేవలం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానులు సంఖ్య భారీగా పెరిగి పోయింది. ఇక ఎన్టీఆర్ తర్వాత సినిమాలు ఏంటి అనే విషయం గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న దేవర అనే సినిమా లో నటిస్తున్నాడు.  ఇక ఈ సినిమా విషయంలో కొరటాల ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే తారక్ మొదటి మూవీ ఏంటి అంటే అందరూ స్టూడెంట్ నెంబర్ వన్ అని చెప్పేస్తుంటారు. రాజమౌళి దర్శకత్వంలో కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కింది.2001 సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది అని చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించి ఒక వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఈ సినిమా రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమాకు పోటీగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమా మాత్రం స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ ముందు నిలబడలేకపోయింది. స్టూడెంట్ నెంబర్ వన్ మొదట యావరేజ్ స్టాక్ తెచ్చుకున్నప్పటికీ ఇక దాడి సినిమా పెద్దగా ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఎక్కువ మంది ప్రేక్షకులు తారక్ సినిమాకే బ్రహ్మరథం పట్టారు. దీంతో స్టూడెంట్ నెంబర్ వన్ దూకుడు ముందు అటు మెగాస్టార్ డాడీ సినిమా కనిపించకుండా పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: