టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రధాన పాత్రల్లో నటించిన యానిమల్ సినిమా టీజర్ వచ్చేసింది. తండ్రీ కొడుకుల బంధం గురించి ఇప్పటి దాకా మనం చాలా సినిమాలే చూసాం. అయితే 'యానిమల్' సినిమాలో చూసేది మాత్రం నిజంగా అంతకుమించే అన్నట్లు టీజర్ లో తెలుస్తుంది.ఇంకా చెప్పాలంటే నిజంగా ఊహించలేని బంధం అది. నిత్యం తిట్టే, ఎప్పుడూ కొట్టే ఓ తండ్రిని తన కొడుకు ఎలా అర్థం చేసుకున్నాడు, అసలు ఆ తండ్రి అలా ఎందుకు మారాడు, కొడుకు ఏం అర్థం చేసుకున్నాడు, దాని వెనుక కథ ఏంటి అనేదే 'యానిమల్' సినిమా టీజర్ లో మనకు కనిపిస్తుంది. అంత హార్ష్ గా ఉన్న తండ్రితో కొడుకు ఎందుకు అంత కూల్‌గా ఎలా ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు అనేది టీజర్‌లో చెప్పకుండా వదిలేసిన మెయిన్ పాయింట్. తండ్రి చిన్న మాట అంటే పడని కొడుకులు ఉన్న ఈ రోజుల్లో తండ్రి కొట్టినా, తిట్టినా భరించేలా ఇంకా చెప్పాలంటే దాని కోసం 'యానిమల్' లాగా మారిపోయిన కొడుకు కథ ఈ సినిమా అని టీజర్ లో స్పష్టంగా తెలుస్తుంది.
సందీప్ రెడ్డి వంగా స్టైల్ మాస్ ఎలిమెంట్స్ సినిమాలో చాలా పుష్కలంగా ఉన్నాయి. రష్మిక మందన అయితే కనిపించిన ఒక్క సీన్‌లో ఎంతగానో మెరిసిపోయింది. ఇక్కడ లేని అందం అక్కడ ఎలా వచ్చింది అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఇక అనిల్ కపూర్, బాబీ డియోల్ అయితే యాటిట్యూడ్ విషయంలో సూపర్ గా అదరగొట్టేశారు. ఇక రణ్‌బీర్ గురించి చెప్పాలంటే… ఈ 'యానిమల్' సినిమాలో నట విశ్వ రూపం చూపిస్తాడని ఖచ్చితంగా అర్ధం అవుతుంది.ఎందుకంటే రణబీర్‌ను మూడు వేరియేషన్స్ లో ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. ఒక షాట్‌లో రణబీర్ పడిపోయినప్పుడు కనిపించే సీన్ అయితే హైలెట్‌గా నిలుస్తుంది. ఇంకా అంతేకాకుండా టీజర్ ఎండ్‌లో బాబీ డియోల్ సింపుల్‌గా ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కూడా సూపర్ అనిపించేలా ఉంది. బాలీవుడ్‌లో కబీర్ సింగ్ సినిమాతో రూ.300 కోట్లకు పైగా కొల్లగొట్టిన సందీప్ రెడ్డి వంగ తాజాగా ఈ సినిమాతో కంప్లీట్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టొచ్చు.డిసెంబర్ 1 న ఈ సినిమా విడుదల కానుంది.