9 నెలలు మోయకపోయినా.. తన బిడ్డల కోసం అలాంటి పని చేసిన నయనతార..!?

Anilkumar
కోలీవుడ్  సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయిన సంగతి తెలిసింది. పెళ్లయిన నాలుగు నెలలకి సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరూ పండంటి అబ్బాయిలకి తల్లైంది నయనతార. విగ్నేష్ తండ్రి అయ్యాడు.nఅప్పట్లో ఈ వార్త ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అన్ని అవాంతరాలను ఎదుర్కొనీ ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలకి తామే తల్లిదండ్రులము అని ప్రూఫ్ చేశారు నయనతార దంపతులు. వాళ్ళ బిడ్డల ఫస్ట్ బర్త్ డే ను చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

 అందరిలా గ్రాండ్గా బర్త్డే పార్టీలతో హంగామా చేసుకోకుండా వాళ్ళు మలేషియా వెళ్ళిపోయి తమ ఇద్దరి పిల్లలతో పూర్తి సమయాన్ని కేటాయిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దానితోపాటు తన బిడ్డలకు ఎప్పుడు దేవుడు ఆశీస్సులు.. పెద్దవాళ్ల ఆశీస్సులు ఉండాలి అని ఏకంగా వంద అనాధ శరణాలయాలకు నయనతార ఆహారం మరియు బట్టలను పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది. దానితోపాటు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పుట్టిన రోజుకి కచ్చితంగా ఇదేవిధంగా ఆమెకు తోచిన సహాయం చేయాలి అని నయనతార స్ట్రాంగ్ గా  ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

దీంతో నయనతార చేసిన మంచి పనికి ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు. నయనతార 9 నెలలు ఆ బిడ్డలని మోయకపోయినా పురిటి నొప్పులు పడకపోయినా ఆ బిడ్డలకు ఆమె అమ్మ అవుతుంది. అందుకే తన బిడ్డలు హ్యాపీగా ఉండాలి అని ఇటువంటి పనులు చేస్తోంది నాయనతార. దీంతో నయనతార పిల్లలకి ఎప్పుడూ మంచే జరగాలి అని తమ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అలా నయనతార చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఇటీవల షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: