ఆ విధంగా రెచ్చిపోవాలని డిసైడ్ అయినా రాశిఖన్నా....!!

murali krishna
బబ్లీ బ్యూటీ 'రాశి ఖన్నా'కి హీరోయిన్ గా క్రేజ్ తగ్గి చాలా కాలమే అయింది. తెలుగులో ఆమెకు వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ ఇలా వరుసగా డిజాస్టర్లు ఆమె ఖాతాలో పడ్డాయి.
పోనీ అటు తమిళంలో అయినా అమ్మడు ఫామ్ లో ఉందా అంటే అదీ లేదు. అంతఃపురం, తిరు, సర్దార్ వంటి చిత్రాలతో కోలీవుడ్ లో కూడా 'రాశి ఖన్నా' బాగా నిరాశ పరిచింది. ఈ పరిస్థితుల్లో 'రాశి ఖన్నా'కి అవకాశాలు బాగా తగ్గాయి. అందుకే.. బాలీవుడ్ పై తన చూపు తిప్పింది. ఓ దశలో హిందీలో ఐటమ్ గాళ్ గా మెప్పిద్దామని ప్రయత్నించినా పెద్దగా ఫలితం రాలేదు.
ఇటు చూస్తే సౌత్ లో 'రాశి ఖన్నా'ను మెయిన్ హీరోయిన్ గా పెట్టుకోవడం శానా కష్టం అని ఫిల్మ్ మేకర్స్ ఇప్పటికే తీర్పు ఇచ్చేశారు. ఇక, ఆమెకి సోలో హీరోయిన్ గా కెరీర్ కట్ అయినట్టే. అందుకే కాబోలు, 'రాశి ఖన్నా' ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ లతో బిజీగా మారుతోంది. ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లు ఒప్పుకొంది ఈ భామ. పైగా అవన్నీ హిందీలోనే. అన్నిటికీ మించి బోల్డ్ వెబ్ డ్రామాలు. నిజానికి 'రాశి ఖన్నా' ఆ మధ్య ఓ హిందీ సినిమాలో నటించినా.. ఆ సినిమాతో ఆమెకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అందుకే.. సినిమాల పై ఫోకస్ తగ్గించి, సిరీస్ ల పై పడింది.
లస్ట్ స్టోరీస్ 2 లో తమన్నా కూడా బోల్డ్ బెడ్ సీన్స్ లో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమన్నా క్రేజ్ పెరిగింది. సో… 'రాశి ఖన్నా' కూడా ఇప్పుడు అలాగే రెచ్చిపోవాలని డిసైడ్ అయ్యింది. ఒకవేళ ఈ సిరీస్ లు హిట్ అయితే, తెలుగులో కూడా ఆమె కెరీర్ కి ఊపు వస్తోంది. మొత్తమ్మీద, 'రాశి ఖన్నా' ఇక వెబ్ భామగా స్థిరపడ్డట్లే. పైగా హిందీలోనే కెరీర్ సెట్ చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అన్నిటికీ మించి వ్యవహారం తేడా జరగకుండా బోల్డ్ క్యారెక్టర్స్ ఒప్పుకుంటుంది. తనకు నటించే స్కోప్ ఎలాగూ ఉండదు, కాబట్టి.. ఎక్స్ పోజింగ్ తోనే కెరీర్ ను నెట్టుకు రావాలని ఆశ పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: