బెడ్ రెస్ట్ తీసుకుంటున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్...!!
పది రోజుల తర్వాత అక్టోబర్ 6 నుంచి హైదరాబాద్ లో గేమ్ ఛేంజర్ జరుగ నుంది. అన్బారీవ్ ఫైట్ మాస్టర్స్ నేతృత్వం లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయ నున్నారు. ఈ హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయాలి అంటే చరణ్ ఫిట్ గా ఉండాలి లేదంటే షూట్ స్టార్ట్ అయిన తర్వాత మధ్య లో ఆగాల్సి వస్తుంది. సినిమాకే హైలైట్ గా ఉండే ఈ యాక్షన్ ఎపిసోడ్ కి మధ్య లో బ్రేక్ ఇవ్వడం ఇష్టం లేకనే చరణ్ పది రోజుల రెస్ట్ తర్వాత ఒకేసారి షూటింగ్ చేయడా నికి రెడీ అవుతున్నాడు. చరణ్ కి గాయాలు అయ్యాయి అనే మాటని బయట కి రాకుండా మూడు నాలుగు రోజులు గా సీక్రెట్ గా ఉంచారు. ఈ విషయం బయట కి రావడం తో మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.