హీరో రామ్ సాంగ్ కి దుమ్ముదులుపుతున్న హాట్ బ్యూటీ విష్ణు ప్రియా...!!

murali krishna
పోరా పోవే అనే షోతో ప్రేక్షకులకు దగ్గరయింది యాంకర్ విష్ణుప్రియ. సుడిగాలి సుధీర్ పక్కన ఫీమేల్ యాంకర్ గా చేయడంతో విష్ణుప్రియకు కలిసి వచ్చిందని చెప్పాలి.ఇక ఈ షో తరువాత ఈ భామ మంచి షోస్ చేస్తూ .. బాగానే పేరు సంపాదించుకుంది. ఇక ఆ తరువాత చిన్నగా సినిమాలు.. సిరీస్ లు అంటూ.. ఇటు సైడ్ కు వచ్చేసింది. ఈ మధ్యనే దయ అనే వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ .. క్రైమ్ జర్నలిస్ట్ గా కనిపించి మెప్పించింది. సినిమాలు, సిరీస్ లు, షోలు అన్ని ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో అమ్మడు పోస్ట్ చేసే వీడియోలు మరో ఎత్తు. అందాల ఆరబోత చేయడంలో ఈ భామ మాస్టర్స్ చేసిందనే చెప్పాలి. ఎద అందాలను ఎలివేట్ చేస్తూ అమ్మడు చేసే అందాల అరబితాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతేనా.. ఏదైనా హిట్ సాంగ్ రిలీజ్ అవ్వడం ఆలస్యం దాన్ని రీ క్రేయేట్ చేసి రచ్చ చేస్తూ ఉంటుంది.
తాజాగా స్కంద చిత్రంలో ఐటెం సాంగ్ కల్ట్ మామ కు విష్ణుప్రియ ఓ రేంజ్ లో స్టెప్పులు వేసి అదరగొట్టింది. రామ్, శ్రీలీల నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ కల్ట్ మామ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రామ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఆడిపాడింది. ఇక ఆ సాంగ్ కు విష్ణుప్రియ తనదైన శైలిలో డ్యాన్స్ వేసి అదరగొట్టింది. బ్లూ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ సేమ్ స్టెప్స్ వేసింది. ఇక దీంతో అభిమానులు ఊర్వశి కూడా ఈ రేంజ్ లో చూపించలేదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: