తండ్రి పై ఎమోషనల్ పోస్ట్ చేసిన రాంచరణ్...!!

murali krishna
చిరంజీవి ప్రస్తుతం 'బింబిసార' దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఓ ఫాంటసీ ఎడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిరు నటిస్తున్న 157వ సినిమా కావడం విశేషం.ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరిస్తున్నారు. అలాగే చిరు 156వ చిత్రాన్ని ఆయన తనయ సుస్మిత కొణిదెల నిర్మించనున్నారు. ఇటీవల చిరంజీవి బర్త్డే సందర్బంగా ఈ ప్రాజెక్ట్ని సైతం అధికారికంగా ప్రకటించారు.
అలుపెరగని సినీ ప్రయాణానికి సినలైన ప్రతిబింబం. సామాన్య నటుడి నుంచి అభిమానులు, ప్రేక్షకులు మెగాస్టార్ అని ముద్దుగా పిలుచుకునే స్థాయి వరకు చిరంజీవి తనని తాను మల్చుకున్న తీరు అన్ని తరాలకు స్ఫూర్తి దాయకం. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన 'ప్రాణం ఖరీదు' సినిమాతో చిరు సినీ ప్రయాణం మొదలైంది. ఈ రంగుల పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు నటుడిగా తానేమిటో నిరూపించు కోవాలన్న తపనే ఆయన్ని ఇన్నేండ్లగా పరిశ్రమలో సుస్ధిరంగా నిలబెట్టింది. ఏ పని చేసినా అందులో ఎంతో శక్తి, ఉత్సాహం చూపే తత్త్వం నేటి తరం నటీనటులకు దీటుగా రాణించేలా చేస్తోంది. 

కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా, సంఘ సేవకుడిగా అన్నింటికి మించి మనసున్న మనిషిగా అటు అభిమానులు, ఇటు సినీ ప్రేమికులు సైతం చిరుని అమితంగా అభిమానిస్తారు. ఇక ఫైట్లు, డాన్స్ల విషయంలో ఆ తరం, ఈ తరం అనే భేదం లేకుండా అందరూ ఎంతో ఇష్టపడతారు. జయాపజయాలకు అతీతంగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని పడి లేచిన కెరటానికి ప్రతీకగా నిలిచిన చిరు ఈ సినీ ప్రయాణంలో ప్రేక్షకులు, అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానంతోపాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసి శుక్రవారంతో సరిగ్గా 45 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన తనయుడు, హీరో, నిర్మాత రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.


సినీ పరిశ్రమలో 45 సంవత్సరాల మెగా జర్నీని పూర్తి చేసుకున్న మన ప్రియమైన మెగాస్టార్కి హదయ పూర్వక అభినందనలు. ఆయన ప్రయాణం ఎంతో గొప్పది. 'ప్రాణం ఖరీదు'తో ప్రారంభమైన ఈ జర్నీలో ఆయన మనల్ని ఇప్పటికీ అబ్బుర పరుస్తూనే ఉన్నారు. వెండితెరపై అద్భుతమైన నటనతో, బయట మీ మానవత్వంతో కూడిన మీ కార్య కలాపాలను కొనసాగిస్తూ కొన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కష్టించే తత్వం, అంకిత భావం వంటి విలువలతో పాటు వాటన్నింటినీ మించి మాలో కరుణను పెంపొందించిన నాన్నకి ధన్యవాదాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: