ఓటీటీ అభిమానులను ఆకట్టుకుంటున్న ఆ వెబ్ సిరీస్...!!

murali krishna
రీసెంట్ గా ఓటీటీలో వెబ్‌ సిరీస్‌ల హవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓటీటీ సంస్థలు సరికొత్త వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇక స్టార్ హీరో హీరోయిన్ లు మరియు డైరెక్టర్లు కూడా వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓవైపు సినిమా లు చేస్తూనే.. మరోవైపు వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఎంతగానో ఉంటున్నారు. అలా తాజాగా ప్రముఖ హీరోయిన్‌ నివేదా పేతురాజ్ కూడా డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టింది. మెంటల్‌ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా మరియు అలా వైకుంఠపురం, విరాటపర్వం వంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించిందీ. 

ఈ ఏడాది విశ్వక్ సేన్ సరసన దాస్‌ కా ధమ్కీ అనే సినిమాలో చివరిగా కనిపించింది.రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బూ లో కూడా ముఖ్య పాత్ర పోషించింది. ఇప్పుడు కాలా వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.అవినాష్‌ తివారీ హీరోగా నటించిన ఈ సిరీస్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరీఓ ఆఫీసర్‌ సితార గా నివేద కనిపించింది రోహన్‌ వినోద్‌ మెహ్రా, నితిన్‌ గులాటి మరియు అనిల్ ఛటర్జీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో కాలా వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.కాలా వెబ్‌ సిరీస్‌కు బిజాయ్‌ నంబియార్‌ దర్శకత్వం వహించారు.

ప్రముఖ టీ- సిరీస్‌ బ్యానర్‌పై భూషణ్‌ కుమార్‌, కిషణ్‌ కుమార్‌, బిజాయ్‌ నంబియార్‌ సంయుక్తంగా ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ను నిర్మించారు.కోల్‌కతాలోని మనీలాండరింగ్‌, హవాలా స్కామ్‌లతో సాగే క్రైమ్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ ఇది. ఇందులో నివేద పలు యాక్షన్‌ సన్నివేశాల్లో కూడ నటించింది.ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆమె హర్షం వ్యక్తం చేస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: