మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున.భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీ ని డైరెక్ట్ చేసారు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.. అలాగే నాజర్, విద్యా రామన్, వినయ్ రాయ్, అభినవ్ గోమటం మరియు రవి వర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.స్పై యాక్షన్ కథకు అంతర్లీనంగా గ్లోబల్ వార్మింగ్, మెడికల్ వేస్టేజీ పాయింట్‌ను టచ్ చేస్తూ గాండీవధారి అర్జున కథను రాసుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.
ఈ రొటీన్ కథకు తన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో హాలీవుడ్ టచ్ ఇస్తూ ప్రేక్షకుల్ని మెప్పించాలని భావించాడు.అలాగే ఈ సినిమా ను లండన్ బ్యాక్‌డ్రాప్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో దర్శకుడు తెరకెక్కించాడు.. అయితే సినిమాలో బలమైన ఎమోషన్ ఎక్కడ కనిపించలేదు. అర్జున్ అనే ఏజెంట్ పాత్రకు వరుణ్ తేజ్ పర్‌ఫెక్ట్ యాప్ట్ గా అయితే నిలిచాడు. అతడిపై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగున్నాయి. ఏజెంట్‌తో పోలిస్తే సాక్షి వైద్యకు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఐరా క్యారెక్టర్ లో ఆమె యాక్టింగ్ అదరగొట్టింది.విలన్ పాత్రలో వినయ్‌రాయ్ ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు. కానీ అతడి క్యారెక్టర్ డిజైనింగ్ లో కొత్తదనం కనిపించలేదు.అయితే థియేటర్ లో అంతగా మెప్పించలేకపోయినా ఈ మూవీ ఓటీటీలో విడుదల కాబోతుంది.బుధవారం (సెప్టెంబర్ 20) ఈ మూవీ ఓటీటీ విడుదల తేదిని మేకర్స్ రివీల్ చేశారు.
గాండీవధారి అర్జున సినిమా సెప్టెంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానుంది...మిగిలిన భాషల గురించి ఈ ఓటీటీ సంస్థ ఇంకా ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు.